నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో కరోనా తాండవం, ఆసుపత్రిల్లో బెడ్స్ ఫుల్, స్వీయ నిర్భంధంలో గ్రామాలు
Covid 19 hospitals full in Nizamabad Warangal and Kamareddy districts : తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.
Covid 19 hospitals full in Nizamabad Warangal and Kamareddy districts : తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ దాదాపు ఫుల్ అయిపోయాయి. జిల్లా కేంద్రం లోని GGH హాస్పిటల్ లో 325 బెడ్స్ గాను 300 మందికి చికిత్స అందిస్తున్నారు. బోధన్, ఆర్ముర్ లో ఏర్పాటు చేసిన 45 చొప్పున ఉన్న పడకలు కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. హాస్పిటల్ లో కేవలం 5 రోజులు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు తగ్గితే క్వారయింటెన్ సెంటర్ కే రోగులను తరలిస్తున్నారు. అటు, మానవతా దృక్పథంతో 20 మంది మహారాష్ట్ర కరోనా బాధితులకు కూడా నిజామాబాద్ జిల్లా వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. మొత్తంగా జిల్లాలోని ఆరు ప్రైవేట్ హాస్పిటల్స్ కి కరోనా చికిత్సకి అనుమతి ఇవ్వగా అక్కడా బెడ్స్ ఫుల్ అయిపోయాయి. ఇక, ICU, ఆక్సిజన్ ఏర్పాట్లు ఉన్న అన్ని హాస్పిటల్స్ లో కరోనా చికిత్స అందించాలని ప్రైవేట్ హాస్పిటల్స్ తో చర్చలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా లోనూ పూర్తి స్థాయిలో ఆసుపత్రులలోని బెడ్లు నిండిపోతున్నాయి. సీరియస్ కేసులని నిజామాబాద్, హైదరాబాద్ కి వైద్యులు రిఫర్ చేస్తున్నారు.
అటు, వరంగల్ జిల్లా లోనూ కరోనా విజృంభన నేపథ్యంలో గ్రామాల్లో సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు గ్రామస్తులు. వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని గట్టుమల్లిఖార్జున స్వామి ఆలయంలో 12మంది ఒగ్గు పూజారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గ్రామంలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో కరోనా రక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని 14 రోజుల సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు గ్రామస్థులు. అటు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 877 పాజిటివ్ కేసుల నమోదుకాగా, కామారెడ్డి జిల్లాలో 676, నిజామాబాద్ జిల్లాలో 201 మందికి వైరస్ సోకింది.