Rains : విజయవాడ, మహబూబ్ నగర్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి జిల్లాలకు వర్ష సూచన
Weather Report : విజయవాడలో రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
Weather Report : విజయవాడలో రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపైకి చేరిన వర్షపు నీరు చేరింది. దీంతో ఉదయం వేళ వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు గంటపాటు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవ్వగా.. ఈదురుగాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో కరెంట్ తీగలు తెగిపోయాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షపు నీరు నిలబడటంతో బీసెంట్ రోడ్, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, వేసవి తాపంతో కొన్నిరోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వర్షం రాకతో కాస్త సేద తీరారు. అటు, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. నిన్న రాత్రి తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ లో భారీ వర్షం కురవగా, ఇవాళ కూడా హైదరాబాద్ తోపాటు, నల్గొండ, యాద్రాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చెప్పింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.