Telangana: 4 ఏళ్ల తర్వాత మళ్లీ బయటకొచ్చిన ర్యాగింగ్ భూతం.. జూనియర్స్ బట్టలు విప్పించి మరీ
రోజురోజుకూ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పెరిగిపోతుంది. తాజాగా వరంగల్‌లోని కాకాతీయ మెడికల్ కాలేజీలో జూనియర్ల విద్యార్థుల పట్ల సీనియర్స్ దారుణంగా ప్రవర్తించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కాలేజ్ యాజమాన్యం. ర్యాగింగ్‌కు పాల్పడిన మొత్తం ఏడుగురు MBBS విద్యార్థులను హాస్టల్స్ నుండి శాశ్వత బహిష్కరణ చేయడంతో పాటు ఏడాది పాటు కాలేజ్ నుండి సస్పెండ్ చేసింది.యాజమాన్యం ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి వాళ్లు ఏం చేశారో తెలుసుకుందాం పదండి.

2022లో జరిగిన పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఘటనతో చెరగని మచ్చపడిన వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరోసారి కలకలం రేపింది. జూనియర్ విద్యార్థుల పట్ల ఏడుగురు సీనియర్స్ అసభ్యంగా ప్రవర్తించారు. జూనియర్స్ బట్టిలు విప్పించి.. వారితో అర్ధనగ్నంగా గోడకుర్చి వేయించారు. ఈ విషయం యాజమాన్యం దృష్టికి చేరడంతో ఘటనపై సీరియస్ అయిన యాజమాన్యం ఏడుగురు సీనియర్ విద్యార్థులపై వేటు వేసింది. వారిని హాస్టల్ నుండి శాశ్వతంగా బహిష్కరించడంతో పాటు కళాశాల నుండి ఏడాది కాలంపాటు సస్పెండ్ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. కొంతమంది MBBS సెకండ్ ఇయర్ విద్యార్థులు వాళ్ళ వాట్సాప్ గ్రూపులో థర్డ్ ఇయర్ సీనియర్ విద్యార్థులను ఉద్దేశించి అసభ్యంగా మేసేజ్‌లు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు జూనియర్స్‌పై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. 29వ తేదీన వారిని హాస్టల్ బిల్లింగ్ పైకి తీసుకువెళ్లి అర్థనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టినట్టుగా సమాచారం. మొత్తం 20 మంది జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది.
తమను అర్ధనగ్నంగా గోడకూర్చి వేయించడం పట్ల ఆవేదన చెందిన జూనియర్ విద్యార్థులు..UGC యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్‌కు, NMC కి పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ కమిటీ విచారణ ఆధారంగా ఏడుగురు సీనియర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని కళాశాల హాస్టల్స్ నుండి శాశ్వత బహిష్కరణ చేశారు. అలాగే సంవత్సర కాలం పాటు కళాశాల నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు
మరోవైపు కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి పిర్యాదు మేరకు మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో ఏడుగురి విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. యాంటీ ర్యాగింగ్ చట్టంలోని 4(I), 4(Iii) సెక్షన్లు, BNSలోని 189, 126(2),127(2) r/w 190 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
