Warangal: కాకతీయ కళా వైభవం.. వరంగల్ నగరానికి అరుదైన గుర్తింపు.. గ్లోబల్ నెట్‌వర్క్ సిటీస్‌లో చోటు
తెలంగాణలోని వరంగల్ నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (UNESCO) గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్‌వర్క్‌లో
UNESCO Global Network of Learning Cities: భారతదేశంలోని పలు నగరాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. తాజాగా.. తెలంగాణలోని వరంగల్ నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (UNESCO) గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్‌వర్క్‌లో వరంగల్ (Warangal) నగరానికి చోటు దక్కింది. ఇప్పటికే వరంగల్‌లోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది వ్యవధిలోనే తెలంగాణలోని వరంగల్‌కు.. యునెస్కో నుంచి మరో గుర్తింపు లభించడం విశేషం.
యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్‌కు చోటు దక్కడంపై.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నిరంతర కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు వరంగల్ తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Great News!
Warangal in Telangana state joins The @UNESCO Global Network of Learning Cities!
Congratulations Warangal & Telangana on this momentous occasion.
After the inscription of World Heritage Site Tag by UNESCO to the Great Ramappa Temple in Warangal, 1/2 pic.twitter.com/ZpbWg3tVXV
— G Kishan Reddy (@kishanreddybjp) September 5, 2022
గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్‌కు చోటు లభించడంపై తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు, మంత్రి కేటీఆర్‌కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..