Governor Tamilisai: దక్షిణాది రాష్ట్రాల మీటింగ్‌కు హాజరైన గవర్నర్ తమిళిసై.. పుదుచ్చెరి నేతల ఆగ్రహం.. అసలేమైందంటే..?
ఇటీవల కేరళలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో తమిళిసై పాల్గొనడంపై వివాదం చెలరేగింది. అసలు, కౌన్సిల్ సమావేశానికి, గవర్నర్‌కు ఏంటి సంబంధం..

Puducherry Lieutenant Governor Tamilisai Soundararajan: తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. సెలైంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతూనే, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు, మరో సంచలనానికి తెరలేపారు తమిళిసై.. ఇటీవల కేరళలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో తమిళిసై పాల్గొనడంపై వివాదం చెలరేగింది. అసలు, కౌన్సిల్ సమావేశానికి, గవర్నర్‌కు ఏంటి సంబంధం, గవర్నర్‌కి అసలక్కడ పనేంటి అనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వెళ్లాల్సిన మీటింగ్‌కి గవర్నర్ వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నాయ్ పుదుచ్చేరి ప్రతిపక్షాలు. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి వెళ్లడానికి గవర్నర్‌కి ఎవరు అధికారులు ఇచ్చారని నిలదీస్తున్నారు. విపక్షాల విమర్శాలకు అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తమిళిసై. గవర్నర్‌గా రాజ్యాంగంలో తనకూ అధికారాలు ఉన్నాయంటున్నారు ఆమె. ముఖ్యమంత్రులతోపాటు మేమూ రాజ్యాంగంలో ముఖ్య భాగమేనని చెబుతున్నారు. గవర్నర్ హోదాలో తనకు కేంద్రం ఆహ్వానం పంపింది. అందుకే, దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యానంటూ క్లారిటీ ఇచ్చారు తమిళిసై. గొప్పతనం చాటుకోవడానికి తానేమి సమావేశానికి వెళ్లలేదని.. యానాం-ఏపీ మధ్య ఉన్న సమస్యలపై చర్చించానంటూ గవర్నర్ పేర్కొన్నారు. అందుకే, దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ మీటింగ్‌కి హాజరయ్యాని స్పష్టంచేశారు.
దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొనడం ద్వారా చాలా విషయాలపై చర్చించడానికి తనకు అవకాశం వచ్చిందన్నారు తమిళిసై. ముఖ్యంగా యానాం-ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అనేక సమస్యలపై డిస్కస్ చేసినట్లు చెప్పుకొచ్చారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..