VMMC Recruitment 2022: వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్ కాలేజీలో ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

న్యూఢిల్లీలోని వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్ కాలేజీ (VMMC New Delhi).. ఒప్పంద ప్రాతిపదికన 90 ట్రైనీ (Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

VMMC Recruitment 2022: వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్ కాలేజీలో ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Vmmc New Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 06, 2022 | 7:19 AM

VMMC New Delhi Recruitment 2022: న్యూఢిల్లీలోని వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్ కాలేజీ (VMMC New Delhi).. ఒప్పంద ప్రాతిపదికన 90 ట్రైనీ (Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏడాదిపాటు కొనసాగే ఈ ట్రైనింగ్‌ అనంతరం సర్టిఫికేట్‌ ప్రధానం చేస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన కాలేజ్‌ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 17 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 16, 2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 10, 2022వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. శిక్షణ వ్యవధిలో నెలకు రూ.1500ల స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Medical Superintendent, VMMC & Safdarjung Hospital, New Delhi.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.