SPMCIL Recruitment 2022: బీటెక్/బీఈ అర్హతతో నెలకు రూ.లక్షన్నర జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL).. 37 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (Deputy Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
SPMCIL New Delhi Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL).. 37 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (Deputy Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, కెమిస్ట్రీ/మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/లో పీజీ డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీకాం, లా, బీటెక్/బీఈ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 3, 2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.200లు చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. స్టైపెండ్ చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- డిప్యూటీ మేనేజర్ (ఎన్విరాన్‌మెంట్) పోస్టులు: 1
- అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్) పోస్టులు: 16
- అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్టులు: 10
- అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టులు: 3
- అసిస్టెంట్ మేనేజర్ (HR) పోస్టులు: 3
- అసిస్టెంట్ మేనేజర్ (ఎన్విరాన్‌మెంట్) పోస్టులు: 1
- అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) పోస్టులు: 1
- అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) పోస్టులు: 1
- అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులు: 1
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.