Wangala Lady Constable: మొదటి జీతం అందుకుని పది మంది ఆకలి తీర్చిన మహిళా కానిస్టేబుల్ .. ఎక్కడంటే..!
ఎవరికైనా జీవితంలో ఉద్యోగం చేయడం అదీ ప్రభుత్వ ఉద్యోగం చేయడం అదో మధురానుభూతి..ఇక ఉద్యోగంలో మొదటి శాలరీ అందుకున్న ఆరోజు ఆ వ్యక్తి సంతోషం చెప్పనలవి కాదు.. అలా ఓ మహిళా కానిస్టేబుల్ విధి నిర్వహణలో మొదటి జీతం అందుకున్నారు. అయితే ఆ జీతంతో ఆమె
Wangala Lady Constable: ఎవరికైనా జీవితంలో ఉద్యోగం చేయడం అదీ ప్రభుత్వ ఉద్యోగం చేయడం అదో మధురానుభూతి..ఇక ఉద్యోగంలో మొదటి శాలరీ అందుకున్న ఆరోజు ఆ వ్యక్తి సంతోషం చెప్పనలవి కాదు.. అలా ఓ మహిళా కానిస్టేబుల్ విధి నిర్వహణలో మొదటి జీతం అందుకున్నారు. అయితే ఆ జీతంతో ఆమె చేసిన పనితో పదిమందితో ప్రసంశలు పొందుతుంది. వివరాల్లోకి వెళ్తే…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గీసుగొండ పోలీసుస్టేషన్ లో అనూష కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన అనంతరం మొదటి జీతం తీసుకున్నారు అనూష. ఆ జీతాన్ని తీసుకున్న ఆమె నేరుగా ఇంటికి పట్టుకుని వెళ్ళలేదు.. వరంగల్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు, సమీప ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వారికి భోజన ప్యాకెట్లను అందచేశారు. ఆ కానిస్టేబుల్ ఆలోచన అభినందనీయమని పలువురు ప్రశంసించారు. మానవత్వం ఇంకా బ్రతికే ఉన్నదని నిరూపించింది మహిళ కానిస్టేబుల్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: