AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana vs Karnataka: తెలంగాణ – కర్ణాటక మధ్య రాయచూర్ చిచ్చు.. ఎమ్మెల్యే సైతం అదే కామెంట్ చేయడంతో..

Telangana vs Karnataka: తెలంగాణ, కర్ణాటక మధ్య రాయచూర్ అంశం రచ్చ రచ్చ చేస్తోంది. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాను తెలంగాణలో...

Telangana vs Karnataka: తెలంగాణ - కర్ణాటక మధ్య రాయచూర్ చిచ్చు.. ఎమ్మెల్యే సైతం అదే కామెంట్ చేయడంతో..
Kcr Vs Siddaramaiah
Shiva Prajapati
|

Updated on: Aug 23, 2022 | 12:17 PM

Share

Telangana vs Karnataka: తెలంగాణ, కర్ణాటక మధ్య రాయచూర్ అంశం రచ్చ రచ్చ చేస్తోంది. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాను తెలంగాణలో కలిపేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తారని ఇటీవల సీఎం కేసీఆర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. రోజు రోజుకు ఈ వ్యవహారం మరింత ముదిరి పాకానపడుతోంది. మరోవైపు, సీఎం కేసీఆర్ కామెంట్స్‌కు సిద్ధరామయ్య కౌంటర్ ఇవ్వడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

ఇంతకీ రాయ్‌చూర్ రగడ ఏంటి? కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా వాసులు తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరారు. లేదంటే తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు కర్ణాటకలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. కర్ణాటక ప్రజల డిమాండ్‌ను బ్టటి చూస్తే తెలంగాణలో ఎంత గొప్పగా సంక్షేమం జరుగుతుందో తెలుసుకోవచ్చునని అన్నారు.

ఇక కర్ణాకట ప్రజలే కాకుండా.. ఏకంగా అక్కడి ఎమ్మెల్యే డాక్టర్ శివరాజ్ సైతం తెలంగాణ ప్రగతి మెచ్చుకుంటూ పలు కామెంట్స్ చేశారు. దాంతో మంత్రి కేటీఆర్ సైతం ఇలాగే రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రగతికి సరిహద్దులు దాటి వస్తోన్న ప్రశంసలుగా వీటిని అభివర్ణించారయన. మహారాష్ట్ర నాందేడ్ నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వెల్లువెత్తాయనీ, ఇప్పుడు రాయచూర్ వంతొచ్చిందనీ, ఇది తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధికి నిదర్శనమని అన్నారాయన.

అయితే, ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన రాయచూర్ వ్యాఖ్యలపై తాజాగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నందువల్ల.. కేసీఆర్ తన స్వార్ధం కొద్దీ చేసిన వ్యాఖ్యలు అని కొట్టి పడేశారు. అదే సమయంలో కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యలపైనా సీరియస్ అయ్యారు సిద్ధరామయ్య. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత ఉమేశ్ కత్తి కూడా కర్ణాటకను రెండుగా విభజించాలని చూడ్డటం వారికే నష్టమని అన్నారాయన.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..