Vinod Kumar: తాడిచర్ల సింగరేణి బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలిచ్చొద్దు .. బోయిన్పల్లి వినోద్ కుమార్ డిమాండ్..
దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరెంటు కొతలు విధిస్తు్న్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యుత్ సమస్య తలెత్తింది. దేశంలో బొగ్గు నిల్వలు తగ్గిపోటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు...

దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరెంటు కొతలు విధిస్తు్న్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యుత్ సమస్య తలెత్తింది. దేశంలో బొగ్గు నిల్వలు తగ్గిపోటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బొగ్గు గనులు ఉన్నాయి. వాటి నుంచి బొగ్గు బయటకు తీసి థర్మల్ విద్యుత్త్ ప్లాంట్లకు సరఫరా చేస్తారు. బొగ్గు కొరతతో బొగ్గు గనులున్న రాష్ట్రాలు బొగ్గును స్థానిక అవసరాలకే వాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ కేంద్రం ప్రభుత్వంలోని సింగరేణి పెద్దలతో మాట్లాడారు.
భూపాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలన కోరారు. ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని కోరారు. తాడిచర్ల నుంచి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు, రాష్ట్ర సింగరేణి అధికారులతో ఇదే విషయమై మాట్లాడినట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని చెప్పి తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును తరలించి భూపాలపల్లి విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలిగిస్తే ఎలా..? అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు.