దేవుని గుట్టపై వింత ఆచారం.. వర్షాల కోసం వరద పాశం..!
ముఖం చాటేసిన వర్షాల కోసం మానవ ప్రయత్నాలు మొదలయ్యాయి. విచిత్ర మొక్కలతో వాన దేవుడి కరుణ కోసం జనం మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. ములుగు జిల్లాలోని దేవుని గుట్టపై ఆ ఊరి గ్రామస్తులు బండపై పాయసం పోసి నాకుతూ విచిత్ర రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. వానలు కురవాలి, పంటలు జనం విచిత్ర రీతిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ముఖం చాటేసిన వర్షాల కోసం మానవ ప్రయత్నాలు మొదలయ్యాయి. విచిత్ర మొక్కలతో వాన దేవుడి కరుణ కోసం జనం మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. ములుగు జిల్లాలోని దేవుని గుట్టపై ఆ ఊరి గ్రామస్తులు బండపై పాయసం పోసి నాకుతూ విచిత్ర రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. వానలు కురవాలి, పంటలు జనం విచిత్ర రీతిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు.. గ్రామాల్లో కప్పతల్లి ఆటలు పొలిమేర దేవతలకు జలాభిషేకలు నిర్వహిస్తూ వర్షాల కోసం పడరాన్ని పాట్లు పడుతున్నారు. విచిత్ర రీతిలో పూజలు మొక్కులు చెల్లిస్తున్నారు.
ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజలు వింత ఆచారంలో పూజలు నిర్వహించారు. కొత్తూరు గ్రామ సమీపంలో దేవుని గుట్ట పైకి గ్రామస్తులు సామూహికంగా ఆటవీ మార్గంలో వెళ్లి, బియ్యం, బెల్లం, పాలు, కుడుకతో చేసిన వరదపాశం ను శ్రీలక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ సమీపంలోని పెద్ద బండరాయిపై పాయసం పోసి గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ నాకుతూ మొక్కు చెల్లించుకున్నారు. ఇలా బండ పై పాయసం పోసి నాకుతూ వర్గాలు కురవాలని కోరుకోవడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇక్కడి ప్రజల విశ్వాసం.. ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తోందని గ్రామస్తులు తెలిపారు.
ఈ విషయం తెలిసి పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇదేవిధంగా బండ పాయసం ఆచారాన్ని పాటిస్తూ వర్షాల కోసం విచిత్ర రీతిలో పూజలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు గ్రామగ్రామాల్లో మహిళలు బిందెలతో నీళ్లు తీసుకొచ్చి బొడ్రాయి, పొలిమేర దేవతలకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు.. వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లి ఆటలాడుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




