Telangana: 54 కుటుంబాలున్న తండా అందరికీ ఆదర్శం..! ఇంతకీ ఏం చేశారంటే..
అదొక చిన్న తండా...పేరుకు చిన్న గ్రామం అయిన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అక్కడి ప్రజలు...ఎవరూ చేయని పని వాళ్ళు చేస్తున్నారు..మధ్యం వల్ల వచ్చే అనర్థాలను గుర్తించి, దాని కోసం ఓ నిర్ణయం తీసుకున్నారు.. వారు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శం అయ్యింది..ఆ గ్రామంలో మద్యం చిచ్చు రేపుతుంది.. కుటుంబాల్లో తగాదాలు పెరిగిపోతున్నాయి. యువత మద్యంకు బానిసలుగా మారి..అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..దీంతో గ్రామస్తులంతా ఒక్కటై ఏకతాటి పైకి వచ్చారు.. ఆ తర్వాత ఏం చేశారంటే..

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కిషన్ తండా గ్రామపంచాయతీ పరిధిలో రెండు మద్యం బెల్టు షాపులు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మద్యం తాగుతూ గొడవలు చేసుకుంటున్నారు..రోజు రోజుకు కుటుంబాల్లో మద్యం వల్ల తగాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో కిషన్ తండా గ్రామస్తులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు..గత కొంతకాలంగా తండాలో బెల్ట్ షాప్ లు ఏర్పాటు చేయడంతో యువత మద్యంకు బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని, మద్యం తాగి కుటుంబాల్లో గొడవలు ప్రారంభమవుతున్నాయని, ఎలాంటి పనులు చేయకుండా మద్యంకు బానిసగా మారుతున్నారని, గ్రామస్తులంతా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యపానం నిషేధం అమలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు..
తమ గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మిన,తాగిన లక్ష రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు..మద్యం అమ్మిన వారిని పట్టిస్తే వారికి పారితోషకం అందిస్తామని పేర్కొన్నారు.మద్యం విక్రయించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు కు వినతిపత్రం సమర్పించారు…కిషన్ తండా గ్రామస్తులు టీవీ9తో మాట్లాడుతూ ఉదయం నుండి అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి యువకులు తండాకు వచ్చి మద్యం సేవించి గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.. ద్విచక్ర వాహనాల పై వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తండాలొఎంతోమంది మద్యానికి బానిసై అప్పులు చేసి భూములు అమ్ముకున్నారని తండావాసులు వాపోతున్నారు..యువత ఎలాంటి పనులు చేయకుండా మద్యం తాగుతూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు.
కేవలం 54 కుటుంబాలు జీవిస్తున్న ఈ తండాలో సుమారు 300 మంది ఉన్నారని రెండు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరపడంతో యువత పెడదారిన పడుతున్నారని మండిపడ్డారు. .మహిళల పట్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తు న్నారని ఆరోపించారు. మద్యం అమ్మకాలు జరిపితే లక్ష రూపాయల జరిమానా, పట్టించిన వారికి పారితోషికం అందించేందుకు తీర్మానం చేసినట్లు వారు తెలిపారు..అధికారులు తమకు సహకరించాలని మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.