AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పామును చంపడం, పాము చంపడం చూసింటారు.. కానీ పాముకు ఊపిరి పోయడం చూశారా?

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనూహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాముకు సర్జరీ చేసి, ఆరు కుట్లు వేసి ప్రాణాన్ని కాపాడారు వెటర్నరీ డాక్టర్. మీరు ఎప్పుడూ ఇలాంటి సర్జరీ చూడరు.. పాముకి కూడా సర్జరీ చేయొచ్చా అని మీరు ఆశ్చర్యపడుతారు కదా! కానీ నిజంగానే జరిగింది. డాక్టర్ గొప్ప మనస్సును గ్రామస్తులు అభినందిస్తున్నారు.

పామును చంపడం, పాము చంపడం చూసింటారు.. కానీ పాముకు ఊపిరి పోయడం చూశారా?
Veterinary Doctor
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 23, 2025 | 10:04 PM

Share

తెలంగాణలోని సిరిసిల్లలో అనూహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాముకు సర్జరీ చేసి, ఆరు కుట్లు వేసి ప్రాణాన్ని కాపాడారు వెటర్నరీ డాక్టర్. మీరు ఎప్పుడూ ఇలాంటి సర్జరీ చూడరు.. పాముకి కూడా సర్జరీ చేయొచ్చా అని మీరు ఆశ్చర్యపడుతారు కదా! కానీ నిజంగానే జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామంలో గాయపడిన పామును కాటిపాములకు చెందిన వ్యక్తి వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళారు. సాధారణంగా మనుషులకే మందులు, ఇంజెక్షన్లు అని అనుకుంటాం. కానీ ఈసారి డాక్టర్, ఆ పాముకి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. గ్రామస్తులు ఈ సన్నివేశాన్ని చూసి అవాక్కయ్యారు. పాముని ఎవరు దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడతారు. కానీ ఈసారి, దానికి మెడిసిన్ ఇచ్చి.. పూర్తిగా ‘పేషెంట్’ లా కేర్ చేశారు.

ఇది కేవలం ఒక విచిత్ర సన్నివేశమే కాదు.. జంతువులపై కరుణ ఉంటే, ఏ జీవిని అయినా కాపాడగలమనే సందేశం కూడా. చంద్రంపేటలో కాటిపాములకు చెందిన వ్యక్తి ఇంటిలోకి పాము దూరింది. అయితే అదే సమయంలో సజ్జపై నుంచి గడ్డపార పాముపై పడింది. దీంతో పాము పొట్టలోంచి గాల్‌బ్లాడర్, పేగులు బయటకు వచ్చి పాముకు గాయమైంది. దీంతో ఇంటి యజమాని సిరిసిల్లకు చెందిన పశు వైద్యాధికారి అభిలాష్‌ను సంప్రదించగా, పాముకి చికిత్స అందించాడు. బయటకు వచ్చిన గాల్‌బ్లాడర్ పేగులను సర్ది చేసి ఆరు అంగుళాల పొడవు స్టిచెస్ వేశారు. మూడు రోజులపాటు అబ్జర్వేషన్ లో ఉంచి పూర్తిస్థాయిలో చికిత్స అందించారు. దీంతో ప్రస్తుతం పాము ఆరోగ్యంగా ఉన్నట్లు పశు వైద్యాధికారి అభిలాష్ తెలిపారు. గాయాల పాలైన పాముకు చికిత్స అందించి ఆరోగ్యంగా తయారు చేసిన డాక్టర్‌కు ఆ వ్యక్తి ధన్యవాదాలు తెలిపాడు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'