Hyderabad: ఫ్యాన్సీ నెంబర్లకు యమ డిమాండ్​.. 9999 ఎంత పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంక్

ఫ్యాన్సీ నెంబర్లు, లక్కీ నెంబర్లపై చాలా మందికి మోజు ఉంటుంది. కొంతమంది న్యూమరాలజీ సెంటిమెంట్‌ను బట్టి కూడా వీటిని దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు.

Hyderabad: ఫ్యాన్సీ నెంబర్లకు యమ డిమాండ్​.. 9999 ఎంత పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంక్
Fancy Number Plates
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 24, 2022 | 1:02 PM

Fancy Registration Number: ఫ్యాన్సీ నెంబర్లు, లక్కీ నెంబర్లపై చాలా మందికి మోజు ఉంటుంది. కొంతమంది న్యూమరాలజీ సెంటిమెంట్‌ను బట్టి కూడా వీటిని దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ లిస్ట్‌లో సినీ హీరోలు(Film Heros), ప్రముఖ బిజినెస్‌మేన్‌లు, పొలిటికల్ లీడర్లు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షలు ఖర్చుపెట్టేందుకు కూడా వెనకాడరు. వాహనం నెంబరు ప్లేటుపై అంకెలన్నీ ఒకేలా ఉంటే.. ఆ కిక్కే వేరు అంటారు కొందరు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు వచ్చేలా చేసుకునేందుకు బిడ్డింగ్ లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టారు. అదీ 9 నంబరు అనుకోండి ఇక పోటీ మాములుగా ఉండదు. తాజాగా  బుధవారం హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌(Khairtabad) ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించగా టీఎస్‌ 09 ఎఫ్‌యూ 9999 నెంబర్ భారీ రేట్ పలికింది. ఈ ఫ్యాన్సీ నంబర్‌ను గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ రూ.10,49,999కు దక్కించుకుంది. టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0009 నెంబర్ రూ.3,50,005 పలికింది. ఆరు నెంబర్లు.. రూ.లక్షకుపైనే పలికనట్లు అధికారులు తెలిపారు. వేలం ద్వారా మొత్తం రూ.30,83,986 సమకూరినట్లు రవాణా శాఖ హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ నాయక్‌ వివరించారు.

  1. TS 09 FV 9999 : ధర 10,49,999.. దక్కించుకున్నది.. గిరిధారి కన్‌స్ట్రక్షన్స్
  2. TS 09 FV 0009: ధర 3,50,005..దక్కించుకున్నది.. సీహెచ్‌ అనంతయ్య
  3. TS 09 FV 0001: ధర 3,50,000..దక్కించుకున్నది.. రాజోర్‌ గేమింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  4. TS 09 FV 0005: ధర 2,20,000..దక్కించుకున్నది.. కెమిస్ట్రీ ఫార్మా కన్సల్టెన్సీ
  5. TS 09 FV 0007: ధర 1,15,000..దక్కించుకున్నది.. జుకా పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  6. TS 09 FV 0006: ధర 1,10,111..దక్కించుకున్నది..పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్

Also Read: ఈ ఫోటోలో ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు.. ఎవరో గుర్తించారా..?

తెల్ల వెంట్రుకలను పీకేస్తే… అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?