Viral Video: బిడ్డ మరణం.. కన్నీరుమున్నీరైన తల్లి కొండముచ్చు.. గుండెలను పిండేసే వీడియో
మనుషులోనే కాదు మూగ జీవుల్లోనూ తల్లి ప్రేమకు వ్యత్యాసం ఉండదని ఋజువు చేసిందో కొండముచ్చు. సృష్టిలో కలుషితం లేనిది ఏదైనా ఉందంటే అది ఒక తల్లి ప్రేమే.
Telangana: మనుషులోనే కాదు మూగ జీవుల్లోనూ తల్లి ప్రేమకు వ్యత్యాసం ఉండదని ఋజువు చేసిందో కొండముచ్చు. సృష్టిలో కలుషితం లేనిది ఏదైనా ఉందంటే అది ఒక తల్లి ప్రేమే అని ఈ వీడియో చూస్తే మరోసారి అర్థమవుతుంది. కన్న బిడ్డ కళ్ల ముందే మరణిస్తే ఆ తల్లి పడే ఆవేదనను మాటల్లో వర్ణించలేం. రోడ్డు ప్రమాదంలో ఓ బుజ్జి కొండముచ్చు మృతి చెందడంతో తల్లి కొండముచ్చు పడ్డ బాధ వర్ణనాతీతం. సంగారెడ్డి జిల్లా(Sangareedy District) జోగిపేట(Jogipet) పట్టణంలోని రహదారులపై వాహనాలు వేగంగా ప్రయాణిస్తున్నాయి. రోడ్డు దాటే క్రమంలో చిన్న కొండముచ్చును గుర్తుతెలియని వాహనం ఢీకుంది. దీంతో అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ.. అచేతనంగా ఉండటం చూసి తల్లి కొండముచ్చు తల్లడిల్లిపోయింది. బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయింది. బిడ్డను ఒడిలో పెట్టుకుని వెలవెలబోయింది. కాసేపు ఆ బాధలో ఏం చెయ్యాలో అర్థం కాక… రోడ్డు డివైడర్ దాటుతూ అటు ఇటు పరుగులు తీసింది. ఎవరైనా తన బిడ్డను కాపాడాతారేమో అని ఆశగా చూసింది. తల్లి కొండముచ్చు తన బిడ్డను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం అక్కడివారి హృదయాల్ని కలచివేసింది. నిజంగా తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
Also Read: Hyderabad: ఫ్యాన్సీ నెంబర్లకు యమ డిమాండ్.. 9999 ఎంత పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంక్
తెల్ల వెంట్రుకలను పీకేస్తే… అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?