Telangana: ట్రెండ్ సెట్ అంతే.. ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం.. ఇదో అద్భుతం..
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మనం ఇప్పటివరకు చూశాం. చిన్నప్పుడు స్కూళ్లలో కలిసి చదువుకున్న పిల్లలు.. ఉన్నత చదువులు అయ్యి.. స్థిరపడ్డాక ఇలా సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే.. ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం గురించి మీరెప్పుడైనా విన్నారా..? ఆ డీటేల్స్ మీ ముందుకు తీసుకొచ్చాం..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ఇలాంటి కలయిక సర్వసాధారణం.. ఒకే బడిలో 10వరకు చదువుకున్న విద్యార్థులు కొన్నేళ్ల తరువాత తిరిగి మళ్లీ కలుసుకుని జరుపుకునే గొప్ప వేడుక.. అపూర్వ కలయిక. అదో అద్భుత ఘట్టమనే చెప్పాలి. ఎందుకంటే.. ఏమీ తెలియని పసితనంతో పదేళ్లపాటు కలిసి చదువుకున్న పిల్లలంతా తిరిగి పెద్ద వయసులో కలుసుకున్న ఆ క్షణాలు ఊహకందని ఆనందనిస్తుంటాయి. చిన్నతనంలో వారు చేసిన అల్లరి, ఆటపాటలు నెమరు వేసుకుంటూ ఆనాటి ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం అనే మాట విన్నారా…? కానీ, కొత్తగా అలాంటి ఒక వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు మన కొల్లూరు ఆడిబిడ్డలు. అవును మీరు మీరు విన్నది నిజమే..
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో ఆడబిడ్డలు జరుపుకున్న ఓ వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే ఊరిలో పుట్టి పెరిగిన ఆడపిల్లలంతా ఒక చోట చేరి జరుపుకున్న సంబరం ఆ ఊరందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆడపడచులంతా కలిసి వదినా మరదళ్లకు దావత్ ఇచ్చారు. వదినలు, మరదళ్లు అంతా కలిసి ఆడిపాడారు. అల్లరి చేశారు. ఇదంతా చూస్తున్న కన్నవారు కళ్లనిండా నీళ్లతో అలా నిలబడి చూస్తుండిపోయారు.
ఒకే ఊరిలో పుట్టిపెరిగారు. చిన్నతనంలో కలిసి ఆడుకున్న వాళ్లంతా పెద్దై అత్తవారి ఇళ్లకు వెళ్లిపోయారు.. పెళ్లి తర్వాత పిల్లలు, సంసారం, బాధ్యతలు అంటూ పీకలదాకా బిజీ, ఒత్తిడితో ఆ ఆడబిడ్డలంతా సంతోషంగా ఒక్కచోట చేరి ఆడిపాడారు. ఎన్నో ఏళ్ల తరువాత ఒకచోట కలిసిన వారంతా తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు.. ఇన్నాళ్లకు కలిసి ఆనందంలో అందరి కళ్లు ఆనంద బాష్పలతో నిండిపోయాయి.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




