బాసర రైల్వేస్టేషన్‌కు అరుదైన గుర్తింపు
బాసర రైల్వేస్టేషన్ మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది. స్వచ్ఛ నిర్వహణలో ఇప్పటికే ఎన్నో అవార్డులు కొల్లగొట్టిన బాసర రైల్వేస్టేషన్ తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ దక్కించుకున్న తొమ్మిది రైల్వేస్టేషన్లలో ఒకటిగా నిలిచింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు, పరిశుభ్రత నిర్వహణ ప్రమాణాల ఆధారంగా ఈ సర్టిఫికెట్ జారీ అయ్యింది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో వందలాది స్టేషన్లు ఉండగా తొమ్మిదింటిలో ఒకటిగా నిలవటం బాసరకు గుర్తింపు తెచ్చింది. బాసర రైల్వేస్టేషన్ ఉన్న దక్షిణమధ్య రైల్వేపరిధిలో వందలాది స్టేషన్లున్నాయి. […]
బాసర రైల్వేస్టేషన్ మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది. స్వచ్ఛ నిర్వహణలో ఇప్పటికే ఎన్నో అవార్డులు కొల్లగొట్టిన బాసర రైల్వేస్టేషన్ తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ దక్కించుకున్న తొమ్మిది రైల్వేస్టేషన్లలో ఒకటిగా నిలిచింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు, పరిశుభ్రత నిర్వహణ ప్రమాణాల ఆధారంగా ఈ సర్టిఫికెట్ జారీ అయ్యింది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో వందలాది స్టేషన్లు ఉండగా తొమ్మిదింటిలో ఒకటిగా నిలవటం బాసరకు గుర్తింపు తెచ్చింది.
బాసర రైల్వేస్టేషన్ ఉన్న దక్షిణమధ్య రైల్వేపరిధిలో వందలాది స్టేషన్లున్నాయి. నాలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న జోన్‌లోని అనేక స్టేషన్లలో కేవలం తొమ్మిది రైల్వేస్టేషన్లకు మాత్రమే ఐఎస్‌ఓ 14001:2015 సర్టిఫికెట్ లభించింది. తెలంగాణ నుంచి హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్, బాసర, నిజామాబాద్, వికారాబాద్, ఆంధ్రప్రదేశ్‌నుంచి విజయవాడ, కర్నూల్, మహారాష్ట్ర నుంచి పర్లివైద్యనాథ్ స్టేషన్లు మాత్రమే ఈ సర్టిఫికెట్ సాధించాయి. జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్‌జీటీ) సూచించిన ప్రమాణాలను అందుకుని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నుంచి ఐఎస్‌ఓ ధ్రువపత్రం పొందాయి. స్టేషన్ల సమర్థ నిర్వహణకు వచ్చిన ఈ గుర్తింపుతో బాసర స్టేషన్ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.