తలలేని మొండాన్ని తీసిన డాక్టర్ల నిర్లక్ష్యానికి వేటు పడింది..!

నాగర్‌ కర్నూల్‌ అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తల లేని శిశువు మొండాన్ని తీసిన ఘటనపై హెల్త్ కమిషనర్ అధికారులు విచారణ నిర్వహించారు. తాజాగా జరిగిన ఘటనపై డాక్టర్లను ప్రశ్నించగా.. వారు సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ తారా సింగ్, డాక్టర్ సుధారాణిపై సస్పెన్షన్ వేటు వేశారు. శుక్రవారం నాగర్‌ కర్నూల్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో.. స్వాతి అనే మహిళ కడుపులోని శిశువు తల లేని శివువు మొండాన్ని తీసిన ఘటనపై పెద్ద […]

తలలేని మొండాన్ని తీసిన డాక్టర్ల నిర్లక్ష్యానికి వేటు పడింది..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 21, 2019 | 2:08 PM

నాగర్‌ కర్నూల్‌ అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తల లేని శిశువు మొండాన్ని తీసిన ఘటనపై హెల్త్ కమిషనర్ అధికారులు విచారణ నిర్వహించారు. తాజాగా జరిగిన ఘటనపై డాక్టర్లను ప్రశ్నించగా.. వారు సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ తారా సింగ్, డాక్టర్ సుధారాణిపై సస్పెన్షన్ వేటు వేశారు.

శుక్రవారం నాగర్‌ కర్నూల్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో.. స్వాతి అనే మహిళ కడుపులోని శిశువు తల లేని శివువు మొండాన్ని తీసిన ఘటనపై పెద్ద దుమారం చెలరేగింది. సిజేరియన్ ఆపరేషన్‌లో భాగంగా.. తల్లి కడుపులోనే శిశువు తల కోసేశారు డాక్టర్లు. కేవలం మొండాన్ని మాత్రమే బయటకు తీశారు. దీంతో.. స్వాతి పరిస్థితి విషమంగా మారడంతో.. ఆమెను హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. అయితే.. దీనికి కారణమైన డాక్టర్లపై.. కుటుంబసభ్యులు దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీసులను సైతం గాయ పరిచారు.