కోరిన కోర్కెలు తీర్చే కోతిదేవుడు..తప్పక దర్శించండి..

కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాడు అక్కడ కోతిదేవుడు. దీంతో ప్రతీ సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుంది. జాతరకు ముందు రోజున వార్షికోత్సవం సందర్భంగా కోతి దేవునికి అభిషేకం,.. రాత్రికి రథోత్సవం నిర్వహించారు. జాతర వేళ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంజనేయుడికి ప్రతిరూపమైన కోతిదేవుడు నిత్యపూజలు అందుకుంటూ అక్కడి ప్రాంత వాసులకు చిన్న కొండగట్టును తలపిస్తుంది. ఇంతకీ జాతర ఎక్కడన్నది చెప్పనేలేదు కదా..ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మణచందా మండలంలో కోతి దేవుని జాతర వైభవంగా నిర్వహించారు. […]

కోరిన కోర్కెలు తీర్చే కోతిదేవుడు..తప్పక దర్శించండి..
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 21, 2019 | 4:32 PM

కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాడు అక్కడ కోతిదేవుడు. దీంతో ప్రతీ సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుంది. జాతరకు ముందు రోజున వార్షికోత్సవం సందర్భంగా కోతి దేవునికి అభిషేకం,.. రాత్రికి రథోత్సవం నిర్వహించారు. జాతర వేళ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంజనేయుడికి ప్రతిరూపమైన కోతిదేవుడు నిత్యపూజలు అందుకుంటూ అక్కడి ప్రాంత వాసులకు చిన్న కొండగట్టును తలపిస్తుంది. ఇంతకీ జాతర ఎక్కడన్నది చెప్పనేలేదు కదా..ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మణచందా మండలంలో కోతి దేవుని జాతర వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు హైదరాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మహారాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. అసలు కోతిదేవుని ఆలయ విశిష్టత పరిశీలిస్తే..

లక్ష్మణచాంద(ఆదిలాబాద్): ధర్మారంలో కోతిదేవుని జాతర శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఏటా రథోత్సవంతో జాతర ప్రారంభమవుతుంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆల య కమిటీ సభ్యులు బారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ యేడూ లాగే ఈ సారి కూడా జాతరలో అ న్నదానంకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం 11 గంటల నుంచి అన్నదాన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచేకాక, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో ఈ జాతరకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత 46 సంవత్సరాల క్రితం అటవీ ప్రాంతం నుండి ఒక వానరం జనావాసంలోకి వచ్చింది. ధర్మారం పీచర గ్రామాల మధ్య తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. అంతటితో ఆగకుండా వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించింది. హనుమంతుని మీద భక్తితో స్థానికులు ఆ వానరాన్ని ఏమీ అనలేకపోయారు. వానర చేష్టలు రోజురోజుకు ఇబ్బంది కలిగించడంతో దానిని అంతమొందించారు. ఆ కోతిని చంపిన కొన్ని రోజులకు ధర్మారం గ్రామానికి చెందిన లింగన్నతోపాటు మరికొందరికి కలలోకి వచ్చింది. తనను చంపిన చోటే సమాధి కట్టాలని నిత్యంపూజలు చేయాలని చెప్పడంతో అక్కడి ప్రజలు సమాధి నిర్మించి ఆలయం ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటివరకు నిత్యం పూజలందుకుంటున్నాడు ఆ కోతిదేవుడు. 1976 మధ్యకాలంలో ఇక్కడ ఆలయం నిర్మించినట్లుగా స్థానికులు చెప్పారు.