చేనేతలకు జగన్ బర్త్‌డే గిఫ్ట్.. ఏమిచ్చారంటే?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు నాడు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రతీ చేనేత కార్మికుల కుటుంబానికి ఏటా 24 వేల రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం వైఎస్సార్ నేతన్న నేస్తంను అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు జగన్. చేనేత కార్మికుల అకౌంట్లలో 196 కోట్లు జమ చేస్తున్నట్లుగా ప్రభుత్వ ఖాతా నుంచి నేతన్నల అకౌంట్లలోకి డబ్బు జమ అయ్యేలా ఆన్‌లైన్ ట్రాన్స్ ఫర్ బటన్ నొక్కిన ముఖ్యమంత్రి […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు నాడు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రతీ చేనేత కార్మికుల కుటుంబానికి ఏటా 24 వేల రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం వైఎస్సార్ నేతన్న నేస్తంను అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు జగన్. చేనేత కార్మికుల అకౌంట్లలో 196 కోట్లు జమ చేస్తున్నట్లుగా ప్రభుత్వ ఖాతా నుంచి నేతన్నల అకౌంట్లలోకి డబ్బు జమ అయ్యేలా ఆన్‌లైన్ ట్రాన్స్ ఫర్ బటన్ నొక్కిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆత్మహత్య లకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. తాను మొదట్నించి చేనేత కార్మికులకు అండగా నిలబడ్డానని ఆయన చెప్పుకున్నారు. ధర్మవరం పట్టు వస్త్రాలు దేశానికే ఆదర్శమని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను తాను పరామర్శించానని, ముడి సరుకు కోసం దీక్ష కూడా చేశానని జగన్ వివరించారు. చంద్రబాబు ఆప్కోను పచ్చ చొక్కాలకు పంచిపెట్టారని, చంద్రబాబు అక్రమాలపై సమగ్ర విచారణ జరుగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి.
చేనేత కష్టాలు విన్నాను కనుకే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించానని జగన్ చెప్పారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ప్రతీ ఏటా 24 వేల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకే వైస్సార్ నేతన్న నేస్తం స్కీం ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. నేతన్న నేస్తం డబ్బులను పాత అప్పులకు జమ చేయవద్దని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం.
బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు… బీసీలంటే సమాజానికే బ్యాక్ బోన్ అని చెప్పిన జగన్, తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. 25 లక్షల మంది పేదలకు ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. జనవరి 9 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఏడు నెలల కాలంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 81 శాతం మందికి ఉద్యోగాలు లభించాయని జగన్ చెబుతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని, కులాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు జగన్.