Kishan Reddy: భయపడం.. జైళ్లను సిద్ధం చేసుకోండి.. బండి సంజయ్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందుకే కల్వకుంట్ల కుటుంబం..
బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందుకే కల్వకుంట్ల కుటుంబం.. అరాచకంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 6 నెలల్లో కల్వకుంట్ల కుటుంబం ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోతుంది.. అందుకే ఇలా చేస్తుందన్నారు. బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీవీ9తో మాట్లాడారు. అరెస్ట్‌లకు భయపడేది లేదు, జైళ్లను సిద్ధం చేసుకోండి.. అంటూ సవాల్ చేశారు.
బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేసి క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పదో తరగతి హిందీ పేపర్ లీక్ విషయంపై మాట్లాడుతూ.. ఎవరో వాట్సాప్‌కి మెసేజ్ చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. బీజేపీని అణిచివేయాలన్న ఆలోచనతో అరెస్ట్‌లు చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.
బండి అరెస్టుపై డీజీపీ అంజన్‌కుమార్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. అరెస్ట్‌కి సంబంధించిన వివరాలపై ఆరా తీయగా.. కాసేపట్లో వివరాలు వెల్లడిస్తామని డీజీపీ తెలిపారన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌పై కాసేపట్లో పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. అరెస్ట్‌కు సంబంధించి ప్రస్తుతం పేపర్ వర్క్ నడుస్తోందని డీసీపీ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..