Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: కాంగ్రెస్‌తో పొత్తు కోసం బీఆర్‌ఎస్ ఆరాటం: మంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, ఢిల్లీలో ఆప్ పార్టీ ఓటమితో కేటీఆర్ కొత్త ఎత్తుడగలు వేస్తూ, కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఎంఐఎం ఆధీనంలో పనిచేస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు.

Kishan Reddy: కాంగ్రెస్‌తో పొత్తు కోసం బీఆర్‌ఎస్ ఆరాటం: మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy
Follow us
Venkata Chari

|

Updated on: Feb 09, 2025 | 10:41 PM

Union Minister Kishan Reddy: కేంద్ర బొగ్గు, గనుల మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆయన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని అందులో పేర్కొన్నారు. ఢిల్లీలో అవినీతి పార్టీ ఆమ్ ఆద్మీ ఓడిపోవడంతో బీఆర్‌ఎస్ ఇబ్బందులో కూరుకపోయిందని, ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవాలని బహిరంగ ఆహ్వానం ఇచ్చారంటూ విమర్శించారు. పాత స్నేహితులు తిరిగి కలవబోతున్నారని తెలిపారు. కేసీఆర్ కాంగ్రెస్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించారని, 2004లో ఆయన కూటమిగా ఎన్నికలలో పోరాడి UPA1లో మంత్రి అయ్యారంటూ గుర్తు చేశారు. ఇంకా, 2014లో తన TRS పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని హామీ ఇచ్చారని ఎద్దేవా చేశారు.

“బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఒకే గూటి పక్షులు ఎలాగైనా కలిసి వస్తాయి. అవినీతి, మైనారిటీ సంతృప్తి, వంశపారంపర్య రాజకీయాలు, అధికార దాహం ఈ రెండు పార్టీలకు సాధారణం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీలు.. మతతత్వ ఎంఐఎం పార్టీ చేసిన ఒప్పందంలో మంచి స్నేహితులు అయ్యాయని తెలంగాణ ప్రజలకు తెలుసు” అంటూ మంత్రి కిషన్ రెడ్డి ఆయన విమర్శించారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య జరిగిన కొన్ని కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. అవేంటో ఓసారి చూద్దాం..

  1. అధికారంలో ఉన్నప్పుడు, BRS కాంగ్రెస్ పార్టీకి 10 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీ భూమిని 2 లక్షల రూపాయలకు ఇచ్చింది. పేదలకు 2BHK ఇళ్లకు మాత్రం భూమి కేటాయించలేదు.
  2. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. బీజేపీని ఓడగొట్టేందుకు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమేననే సంకేతాలను కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా వంతపాడింది.
  3. కాంగ్రెస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి మంత్రులవుతారు. ఆ తర్వాత బీఆర్ఎస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారు. ఇద్దరి ఆలోచనలు సేమ్-టు-సేమ్ అని చెప్పేందుకు ఇంతకన్నా ఇంకా ఏం కావాలి.
  4. రాష్ట్రపతిగా.. గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి.
  5. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను కలిపి ఉంచేది మతతత్వ పార్టీ ఎంఐఎం. మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం, ముస్లిం ఓట్ల కోసం.. ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ఇద్దరొక్కటయ్యారు.
  6. 2023 ఆగస్టులో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం విషయంలోనూ.. బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
  7. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సందర్భంలోనూ.. జాతి ప్రయోజనాలను పక్కనపెట్టి.. ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతిచ్చింది.

ఈ రెండు పార్టీల అనైతిక పొత్తును చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయని, అలాంటిది మరోసారి బహిరంగంగా దోస్తీకి ఈ రెండు కుటుంబ పార్టీలు సిద్ధమయ్యాయంటూ, చెత్త రాజకీయాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ పార్టీలను మరోసారి కలిపేందుకు మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తోందంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..