AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది.

Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ
BRS MLAs defection case
Ram Naramaneni
|

Updated on: Feb 10, 2025 | 7:56 AM

Share

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరగనుంది. పోచారం శ్రీనివా‌స్‌రెడ్డి, ఎం.సంజయ్‌ కుమార్‌, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రిట్‌ పిటిషన్‌ వేశారు

మరోవైపు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లను జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కే.వినోద్‌ చంద్రన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని ఈ నెల 4న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అయితే ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలన్న అంశాన్ని మాత్రం అందులో స్పష్టం చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం నాటి సుప్రీం కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ కోరుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని పదే పదే చెప్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల ధరలు పెరిగాయ్..
నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల ధరలు పెరిగాయ్..
ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు 2026: శ్రావణ మాస విశేషాలతో పూర్తి..
ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు 2026: శ్రావణ మాస విశేషాలతో పూర్తి..
నాటు కోడి స్టైల్‌లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు
నాటు కోడి స్టైల్‌లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు
విజయ్ దళపతి కొడుకు ఫస్ట్ రియాక్షన్.. ఆకట్టుకుంటున్న మాటలు..
విజయ్ దళపతి కొడుకు ఫస్ట్ రియాక్షన్.. ఆకట్టుకుంటున్న మాటలు..
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? - జిడ్డు కృష్ణమూర్తి
భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? - జిడ్డు కృష్ణమూర్తి
రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా
రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా
916 రేటింగ్ పాయింట్లతో చరిత్ర.. టీ20ల్లో ఈషాన్ కొత్త రికార్డ్
916 రేటింగ్ పాయింట్లతో చరిత్ర.. టీ20ల్లో ఈషాన్ కొత్త రికార్డ్
హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. ఇది కదా కావాల్సింది..
హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. ఇది కదా కావాల్సింది..
చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..
చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..