AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుర జ్ఞాపకాలు..! ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన బండి సంజయ్

"మంజుల ఫొటోలు మంచిగ రావాలే.. లేకుంటే కెమెరా గుంజుకుపోతది..! అసలే చిన్నప్పటి నుండి టెర్రర్.. మీరే ఫోటోలు దిగుతరా.. మాకు ఛాన్సివ్వరా? సంజయ్.. ఈ శోభ గుర్తుందా? సీరియల్ నెంబర్ 1.. ఈమె తెచ్చిన చిట్టీలు కాపీ కొడుతుంటే వెంకట్ సార్ మనందరిని కొట్టిండురా గుర్తుందా..? ఆరేయ్ శ్రీను.. దూరం దూరం ఉంటవేందిరా.. ఇటు రా.. అందరం కలిసి ఫోటోలు దిగుదాం..!" అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపారు బండి సంజయ్ కుమార్.

మధుర జ్ఞాపకాలు..! ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన బండి సంజయ్
Bandi Sanjay Kumar Friendship Day
Vidyasagar Gunti
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 04, 2024 | 7:29 PM

Share

“మంజుల ఫొటోలు మంచిగ రావాలే.. లేకుంటే కెమెరా గుంజుకుపోతది..! అసలే చిన్నప్పటి నుండి టెర్రర్.. మీరే ఫోటోలు దిగుతరా.. మాకు ఛాన్సివ్వరా? సంజయ్.. ఈ శోభ గుర్తుందా? సీరియల్ నెంబర్ 1.. ఈమె తెచ్చిన చిట్టీలు కాపీ కొడుతుంటే వెంకట్ సార్ మనందరిని కొట్టిండురా గుర్తుందా..? ఆరేయ్ శ్రీను.. దూరం దూరం ఉంటవేందిరా.. ఇటు రా.. అందరం కలిసి ఫోటోలు దిగుదాం..!” అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపారు బండి సంజయ్ కుమార్.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన చిన్ననాటి స్నేహితులు, సరస్వతి శిశు మందిర్ క్లాస్ మేట్ల మధ్య జరిగిన సంభాషణ ఇది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బండి సంజయ్ చిన్ననాటి స్నేహితులు 35 మంది హైదరాబాద్ వచ్చారు. ఎల్బీనగర్ సమీపంలో మన్సూరాబాద్ లో బండి సంజయ్ ఉన్నారని తెలుసుకున్న వారంతా అక్కడికి వచ్చారు. పుల్లూరి శ్రీనివాసరావు, బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల్య మిత్రులందరూ బండి సంజయ్‌ను కలిశారు.

అనుకోకుండా వచ్చిన స్నేహితులందరినీ చూసిన బండి సంజయ్ అందరినీ పేరుపేరునా పలకరించారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సరదాగా గడిపారు. చిన్నప్పుడు చేసిన అల్లరి, దోస్తుల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తన ఫ్రెండ్స్ అందరినీ పేరు పేరునా పలకరిస్తూ.. ఎవరెవరు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే వివరాలను తెలుసుకున్నారు. వారి కుటుంబ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత అందరితో కలిసి ఫోటోలు దిగారు. తన చిన్ననాటి స్నేహితుడిని కలవడంతో వాళ్లందరి ఆనందానికి ఆవధుల్లేవు. సంజయ్ బిజీబిజీగా ఉన్నప్పటికీ అక్కడే దాదాపు రెండు గంటలకు పైగా గడిపారు. స్నేహితులంతా కలిసి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేక్ ను సంజయ్ కు తినిపించారు. తిరిగి పయనమయ్యేటప్పుడు సైతం సంజయ్ అందరనీ మనసారా పలకరించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..