Bhadradri Kothagudem: కారు బయటపెట్టాలంటేనే భయపడుతున్న జనాలు.. ఎందుకో తెలిస్తే షాకే..
Bhadradri Kothagudem: వాళ్లెవరో తెలియదు? ఎందుకు చేస్తున్నారో తెలియదు? కానీ, కార్ల అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా ప్రజలకు..
Bhadradri Kothagudem: వాళ్లెవరో తెలియదు? ఎందుకు చేస్తున్నారో తెలియదు? కానీ, కార్ల అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఆ పోకిరీలెవరు? ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? వివరాల్లోకెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి చిల్లరగాళ్లు చెలరేగిపోతున్నారు. పార్క్ చేసిన కార్లే టార్గెట్‌గా విధ్వంసాలకు పాల్పడుతున్నారు. అందరూ నిద్రపోయాక వీధుల్లోకి వస్తోన్న ఆవారాగాళ్లు, ఇంటి ముందు పార్క్ చేసిన కార్ల అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. చుంచుపల్లిలోని రామాంజనేయ, రాంనగర్ కాలనీల్లో 15 కార్ల అద్దాలను పగలకొట్టేశారు పోకిరీలు. ఎప్పటిలాగానే తమ ఇంటి ముందు కారును పార్క్ చేశామని, తెల్లారి చూసేసరికి అద్దాలు పగలిపోయి ఉన్నాయంటోంది ఓ బాధితురాలు. తమ కారులాగే మరో 15 కార్ల అద్దాలను ధ్వంచేశారని చెబుతోంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని, వాళ్లేవరో కనిపెట్టి శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. కాగా, ఈ పోకిరీల భయంతో ఇంటి ముందు కార్లను పార్క్ చేయాలంటేనే భయపడుతున్నారు చుంచుపల్లి మండల ప్రజలు. అంతా నిద్రపోయాక, ఇలా ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోన్న ఆవారాగాళ్లకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో కారు అద్దాలను ధ్వంసం చేయక ముందే వాళ్లను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..