Ugadi 2023: కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉగాది చిచ్చు.. వేయిస్తంభాల గుడిలో ఉత్సవాలపై సందిగ్ధం..

వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలో ఉగాది ఉత్సవాలపై సందిగ్ధం నెలకొంది. వేడుకల చుట్టూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది.

Ugadi 2023: కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉగాది చిచ్చు.. వేయిస్తంభాల గుడిలో ఉత్సవాలపై సందిగ్ధం..
Ugadi 2023
Follow us

|

Updated on: Mar 21, 2023 | 6:06 PM

వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలో ఉగాది ఉత్సవాలపై సందిగ్ధం నెలకొంది. వేడుకల చుట్టూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. ఆలయం ఆవరణలో తెలుగు సంవత్సరాది ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ సర్క్యూలర్ దుమారం రేపుతోంది.

వేయి స్థంభాల ఆలయం ఆవరణలో ఎలాంటి ఉత్సవాలు నిర్వహించాలన్నా 25వేల రూపాయలు డిపాజిట్ చేయాలనేది ఆ సర్క్యులర్ సారాంశం. అయితే ఆ డబ్బును ఎట్టి పరిస్థితుల్లో కట్టేది లేదంటున్నారు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాస్యం వినయభాస్కర్.

కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షణలోని ఆలయాల ఆవరణలో ఎలాంటి ఉత్సావాలు నిర్వహించాలన్నా 25వేల రూపాయలు డిపాజిట్ చేయాలని సర్క్యూలర్ జారీ చేశారు. ఆ డిపాజిట్ రీఫండబుల్ అని సూచించారు.. అయితే ఆలయాల ఆవరణలో జరిగే ఉత్సావాలకు డబ్బులు డిపాజిట్ తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా చెల్లించే ప్రసక్తేలేదంటున్న స్థానిక ఎమ్మెల్యే.

ఇవి కూడా చదవండి

బతుకమ్మ, ఉగాది ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి లాంటి ఉత్సవాలు వేయి స్తంభాల గుడి ఆవరణలో అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీ. నగరం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వేలసంఖ్యలో చేరుకొని ఉత్సావాల్లో పాల్గొంటారు.. ఎప్పుడూ డబ్బులు వసూలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకు డబ్బులు కట్టమని అడుగుతున్నారో తెలియడం లేదంటున్నారు ఆలయ పూజారి.

ఆలయాలను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉగాది ఉత్సవాలకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో వేయి స్థంభాల గుడిలో వేడుకలు ఉంటాయా.. లేదా అనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??