Telangana: ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపానికిగురై ఆత్మహత్య..

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 24న బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేశారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు. ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థులిద్దరూ ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేరారు.

Telangana: ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపానికిగురై ఆత్మహత్య..
Inter Students
Follow us

|

Updated on: Apr 24, 2024 | 8:34 PM

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 24న బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేశారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు. ఫలితాలు వెలువడిన వెంటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థులిద్దరూ ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేరారు. తెలంగాణలోని నస్పూర్ మండలం దొరగారిపల్లి గ్రామానికి చెందిన గట్టిక తేజస్విని (18) మ్యాథ్స్ 1A, 1B రెండు పేపర్‌లు ఫెయిల్ అయిందని తెలుసుకుని చీరతో బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మంచిర్యాలలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో చదువుతోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె తండ్రి శంకర్ ఫిర్యాదు ప్రకారం, ఆమె తన మ్యాథ్స్ పరీక్షకు సంబంధించిన రెండు పేపర్లలో ఫెయిల్ కావడంతో మనస్థాపానికిగురై ఇలాంటి ఘటనకు పాల్పడిందని తెలిపాడు.

తేజస్విని ఘటన మరువక ముందే ఇలాంటి ఘటనే మరొకటి చేటు చేసుకుంది. తాండూరు గ్రామానికి చెందిన అచలాపూర్ మండలం మైతం నారాయణ కుమారుడు మైతం సాథ్విక్ (18) తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెల్లంపల్లివాస్‌లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్ మొదటి సంవత్సరం చదువుతున్న సాథ్విక్ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ విషయం ఇంట్లో చెబితే ఎక్కడ మందలిస్తారో అన్న భయంతో తల్లిదండ్రులకు చెప్పలేక మానసిక క్షోభకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి