Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి తగిన శాస్తి జరగాల్సిందే.. లేకపోతే మరీ ఇలానా.. ఏసీబీ చిక్కిన DSP, CI..!

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిని మెడికల్ కౌన్సిల్ దాడుల చేసి మరీ పట్టించింది. వారిని చట్టం నుంచి తప్పించేందుకు శిక్షించాల్సిన పోలీసులే రక్షణగా నిలిచారు. చివరికి ఇలా ఏసీబీ అధికారులకు చిక్కారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. సూర్యాపేట డీఎస్పీ, టౌన్ సీఐలను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు ఏసీబీ అధికారులు.

వీరికి తగిన శాస్తి జరగాల్సిందే.. లేకపోతే మరీ ఇలానా.. ఏసీబీ చిక్కిన DSP, CI..!
Suryapet Dsp, Ci Arrested
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: May 13, 2025 | 8:43 AM

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిని మెడికల్ కౌన్సిల్ దాడుల చేసి మరీ పట్టించింది. వారిని చట్టం నుంచి తప్పించేందుకు శిక్షించాల్సిన పోలీసులే రక్షణగా నిలిచారు. చివరికి ఇలా ఏసీబీ అధికారులకు చిక్కారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. సూర్యాపేట పట్టణంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక దాడులు చేసింది. ఆసుపత్రుల అక్రమాలపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పూర్తి నివేదిక అందించారు మెడికల్ కౌన్సిల్ అధికారులు. దీంతో కేసులు నమోదు చేశారు. అయితే కేసుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కక్కుర్తిపడ్డ డీఎస్పీ, సీఐ.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

సూర్యాపేట జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులపై పలు ఫిర్యాదులు వచ్చాయి. అర్హులైన డాక్టర్లు లేకుండానే పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ క్రమంలో కనీస అర్హత లేకుంగానే ఓ స్కాన్ సెంటర్ నిర్వాహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీలు చేసి, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీ పార్థసారథి, టౌన్ సీఐ రాఘవులకు ఐఎంఏ డాక్టర్స్ బృందం ఫిర్యాదు చేసింది.

ఈ విషయంపై విచారణ చేపట్టిన సూర్యాపేట టౌన్ సీఐ వీర రాఘవులు.. కేసు మాఫీపై రాజీ బేరం పెట్టాడు. కేసులో సెక్షన్లు మార్చడానికి డీఎస్పీ పార్థసారథితో సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ పంపించాడు సీఐ వీర రాఘవులు. దీంతో ఫిర్యాదుదారుడిని 25 లక్షల రూపాయల ఇవ్వాలంటూ డీఎస్పీ డిమాండ్ చేశాడు. అయితే, ఇద్దరి మధ్య 16 లక్షల రూపాయలకు డీల్ కుదిరింది. ఈ క్రమంలోనే ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. బాధితుడిని నుంచి లంచం తీసుకుంటుండగా, సూర్యాపేట టౌన్ సీఐ రాఘవులు, డీఎస్పీ పార్థసారథి లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఇద్దరిపై కేసు నమోదు చేసి కస్టడీలో పెట్టామని నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..