ఆధార్ కార్డ్ లేకుంటే ఫ్రీ బస్‌లో ప్రయాణించలేరా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించుద్దామని ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేస్తుంది. అయితే మహిళలు బస్సు ప్రయాణం చేయాలంటే కండక్టర్ కు ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించాల్సి ఉంటుంది. దాని బట్టే ఉచిత ప్రయాణానికి అర్హులు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళల కోసం మరో గుడ్ న్యూస్ అందించారు.
మహిళలు ఇకపై ఆర్టీసీ ఉచిత బస్సు పథకానికి సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు లేకున్నా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్ కార్డు స్థానంలో ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను చూపించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ ఉంటె చాలా అని ఒక నెటిజన్ ఎండీ సజ్జనార్ ను అడగగా దీనికి బదులుగా సమాధానం ఇచ్చారు సజ్జనార్. ఉచిత ప్రయాణానికి గుర్తింపు ఆధార్ కార్డుకు బదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ప్రయాణించవచ్చని ప్రకటించారు. అంటే మహిళల వద్ద ఆధార్ కార్డు లేకున్నా ఇతర గుర్తింపు కార్డులను చూపించి కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీలో ఎన్నో మార్పులు చేపట్టారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం :
80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో
బాంబులు పడతాయని భయం వేసింది వీడియో
ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
