బాంబులు పడతాయని భయం వేసింది వీడియో
భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపిఎల్ 2025 సీజన్లో తొలిసారి మ్యాచ్ ను మధ్యలోనే రద్దు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దయింది. భద్రతా కారణాలతోనే ఆపేసినట్లు హిమాచల్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐపిఎల్ చైర్మన్ దుమాల్ కూడా ప్రేక్షకులు త్వరగా వెళ్ళిపోవాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ పఠాన్ కోట్ ప్రాంతాల్లో పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ధర్మశాలలో ముందస్తుగా ఆటను నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీంతో ఆటగాళ్ళు, సపోర్ట్ సిబ్బంది, ఐపిఎల్ సభ్యులు, ప్రేక్షకులు మైదానాన్ని ఖాళీ చేశారు.
ఈ క్రమంలో ఓ చీర్ లీడర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించేశారు. ఇక్కడంతా భయంగా ఉందని చీర్ లీడర్ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరూ బాంబులు పడతాయేమోనని అరుస్తూ వెళ్ళిపోయారని ధర్మశాలను వదిలి వెళ్ళడం బాధగా ఉందని పేర్కొంది. ఐపిఎల్ ప్రతినిధులు సరైన చర్యలు తీసుకున్నారని అయితే తను ఇప్పటికి షాక్ లోనే ఉన్నానంటూ ఆమె చేసిన కామెంట్లతో వీడియో వైరల్ గా మారింది. ధర్మశాల నుంచి ఆటగాళ్లను ఢిల్లీకి తరలించేందుకు బిసిసిఐ వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేసింది. ధర్మశాలలో విమానాశ్రయాలను మూసివేశారు. దాడుల నేపథ్యంలో ఐపిఎల్ నిర్వహణపై చైర్మన్ అరుణ్ ధుమాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ధర్మశాలకు దగ్గరగా ఉండే ఉనా స్టేషన్ నుంచి రెండు జట్ల ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులను తరలించారని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
మరిన్ని వీడియోల కోసం :
కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో
పైనాపిల్ జ్యూస్ తాగడం వలన బోలెడు లాభాలు వీడియో
ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో
మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
