Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో

Samatha J

|

Updated on: May 12, 2025 | 7:42 AM

రాం కేవల్. పేరుకు తగ్గట్టే ఆ బాలుడు రాష్ట్రమంతా తనవైపే చూసేలా అద్భుతం చేశాడు. 80 ఏళ్లుగా అజ్ఞాన అంధకారంలో మగ్గుతున్న తనూరి జనాలకు ఊపిరి పోశాడు. తరాలు మారుతున్నా అక్షరజ్ఞానం అబ్బని ఆ ఊరి జనాలకు కొత్త ఆశలు నింపాడు. ఆ 16 ఏళ్ల బాలుడు కొత్తగా ఏమి చేయలేదు. కేవలం 10వ తరగతి పాస్ అయ్యాడంతే. అదే ఆ ఊరిలో మహా అద్భుతం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. లక్నోలోనే ఒక మారుమూల గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది.

బారాబంకీ జిల్లా నిజాంపూర్ గ్రామంలో గత 78 సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా 10వ తరగతి పూర్తి చేయలేదు. అయితే ఈ ఏడాది మాత్రం 16 ఏళ్ల రాం కేవల్ ఇన్నేళ్లకుగాను 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు. ఉత్తరప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి తన గ్రామంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు. బాలుడి ప్రతిభను ఆ ఊరి జనాలు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఏకంగా డిఎం సాహెబ్ బాలుడిని సత్కరించి అభినందించారు. నిజానికి రాం కేవల్ టెన్త్ లో తెచ్చుకున్నది సెకండ్ క్లాస్ మార్కులే అయినప్పటికీ అతని పేరు మాత్రం రాష్ట్రమంతా మారుమోగిపోయింది. ఆ గ్రామంలో ప్రాథమిక పాఠశాల చక్కని రోడ్లు ఉన్నాయి. అయితే పేదరికం కారణంగా చాలామంది దినసరి కూలీలుగా మారారు. రాం సేవక్ తండ్రి కూడా కూలీనే. రాం సేవక్ కుటుంబం గడవడం కోసం ఊరిలో జరిగే వివాహ ఊరేగింపుల్లో తలపై దీపాలు మోస్తాడు. రాం కేవల్ ది ఏడుగురు సభ్యుల కుటుంబం. తల్లి, తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు సోదరిమణులతో ఉంటాడు. వీరు నివసించే పూరి గుడిసెలో రెండు గదులే ఉన్నాయి. అందులో ఒక గదిలో పశువులు ఉంటాయి. మరొక గది మొత్తం కుటుంబం నివసిస్తుంది. వీరి ఇంటికి కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేదు. ఎంఎల్ఏ కోటా కింద వచ్చిన సోలార్ లైట్ మాత్రమే రాత్రిపూట వారికి దిక్కు. రాం సేవక్ పగలంతా కూలి పనికి వెళ్లి రాత్రుళ్ళు సోలార్ లైట్ వద్దనే చదువుకునేవాడు.

మరిన్ని వీడియోల కోసం :

కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో

పైనాపిల్ జ్యూస్ తాగడం వలన బోలెడు లాభాలు వీడియో

ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో

మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో