Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో

కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో

Samatha J

|

Updated on: May 11, 2025 | 4:59 PM

ఆధ్యాత్మికంగానే కాదు పర్యావరణపరంగా చీపురులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. హిందూ సంప్రదాయం ప్రకారం చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా చెబుతారు. అందుకే ఈ చీపురు కొనడానికి ప్రత్యేకమైన రోజులు సూచించారు. అలాగే ఇంటిని శుభ్రం చేసుకునే ఈ చీపురును ఏ దిశలో ఉంచాలి? ఏ దిశలో ఉంచకూడదు? ఏ దిశలో ఉంచితే ఎలాంటి ప్రభావం ఆ కుటుంబం పై చూపుతుంది అనే విషయాలు కూడా పెద్దలు సూచించారు. అవేంటో తెలుసుకుందాం. చీపురుతో పని అయిన తర్వాత దానిని పెట్టే ప్లేస్ విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. మీరు మీ డబ్బును ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అలాగే మీ చీపురును కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. ఎవరూ చూడని విధంగా గదిలో ఒక మూలాన ఉంచాలట. చీపురును నిటారుగా పెట్టడం, తలక్రిందులుగా పెట్టడం చేయకూడదట.

చీపురును ఎల్లప్పుడూ కింద బల్లపరువుగా ఉంచాలి. ఇక కొత్త చీపురు కొనాలనుకున్నప్పుడు సరైన రోజు చూసుకొని కొనుక్కుంటే మంచిదంటున్నారు. సోమవారం చీపురును కొనడం అశుభంగా చెబుతారు. శనివారం కూడా చీపురు కొనకూడదట. దీనివల్ల శని దోషం కలుగుతుందని నమ్ముతారు. అలాగే శుక్ల పక్షంలో చీపురు కొనడం మంచిది కాదంటున్నారు. ఇక చీపురును డైనింగ్ రూమ్ లో అస్సలు ఉంచకూడదట. దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతారు. అలాగే కొత్త ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు మురికి, దుమ్మును తొలగించడానికి కొత్త చీపురును ఉపయోగించాలని చెబుతారు. ఇలా చేయకపోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. గురువారం రోజున కొత్త చీపురు కొనడం శుభప్రదంగా చెబుతారు. అది కూడా కృష్ణ పక్షంలోనే గురువారం చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు వారి తెలిపిన అంశాలు ఆధారంగా అందించినవి మాత్రమే.

మరిన్ని వీడియోల కోసం :

వామ్మో ఈ కాకి ఎంత పని చేసింది వీడియో

ఆ జైలు చుట్టూ షార్క్ చేపలతో రక్షణ.. ఎందుకంటే వీడియో

బంగారాన్ని ఇలా కూడా డెలవరీ చేస్తారా? వీడియో