Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో కేసులో లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత వీడియో

మరో కేసులో లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత వీడియో

Samatha J

|

Updated on: May 11, 2025 | 5:09 PM

సస్పెండ్ అయ్యి జైలుకు వెళ్ళొచ్చినా తీరు మారలేదు. అక్రమాల్లో ఆరితేరిన లేడీ పోలీస్ స్వర్ణలతకు సినిమా పిచ్చి ఇంకా పోలేదు. గతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయ్యి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయిన రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విశాఖపట్నం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన కేసులో స్వర్ణలత పాత్ర ఉన్నట్లు తెలిచింది పోలీసులు.

నకిలీ ఏ సి బి ఇన్స్పెక్టర్ సుధాకర్ ను అడ్డుపెట్టుకొని డబ్బుల కోసం సబ్ రిజిస్ట్రార్ ని బెదిరించినట్లు తెలిచింది. సుధాకర్ కాల్ లిస్ట్ ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం భాపట్ల జిల్లాలోని ఏ ఆర్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. గతంలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయ్యారు స్వర్ణలత. సినిమాల్లో నటించాలన్న పిచ్చితో డబ్బులు కూడగట్టుకునేందుకు దొంగ పోలీస్ అవతారమెత్తారు. నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు డాన్స్ లో నేర్చుకున్నారు. అంతేకాదు ఏపీ 31 పేరుతో ఓ సినిమా పోస్టర్ ని సైతం రిలీజ్ చేశారు. ఆమె డాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నకిలీ దందా వ్యవహారం బయటపడటం అరెస్ట్ అవ్వడంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న స్వర్ణలత మళ్ళీ దందాలకు పాల్పడుతున్నట్లు తెలిచారు పోలీసులు. ఆమెకు ఇంకా సినిమా పిచ్చి పోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఏ ఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఉంది. ఆమెను విచారిస్తున్నారు పీఎం పాలెం పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం :

వామ్మో ఈ కాకి ఎంత పని చేసింది వీడియో

ఆ జైలు చుట్టూ షార్క్ చేపలతో రక్షణ.. ఎందుకంటే వీడియో

బంగారాన్ని ఇలా కూడా డెలవరీ చేస్తారా? వీడియో