బంగారాన్ని ఇలా కూడా డెలవరీ చేస్తారా? వీడియో
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా కాదేదీ డోర్ డెలివరీకి అనర్హం అంటూ చాటుతోంది ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ. ఆహారం, కిరాణా సరుకులే కాదు. ఏకంగా బంగారం కూడా డోర్ డెలివరీ చేస్తోంది. స్విగ్గీ ఇన్ స్టామార్ట్ డోర్ స్టెప్ గోల్డ్ డెలివరీ అంటూ హై సెక్యూరిటీ మధ్య సరికొత్తగా డెలివరీ సర్వీసులు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంట వైరల్ గా మారింది. ఒక స్విగ్గీ డెలివరీ ఏజెంట్ తన స్కూటర్ పై వెళుతుండగా ఓ గార్డ్ చేతిలో మినీ లాకర్ పట్టుకొని ప్రయాణిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్లిప్ లో ఇన్ స్టామార్ట్ డెలివరీ ఏజెంట్ బైక్ పై ముందు భాగంలో కూర్చుని బ్రాండ్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు.
ఒక సెక్యూరిటీ గార్డ్ వెనుక భాగంలో మినీ లాకర్ ను పట్టుకొని కనిపించాడు. ఆ లాకర్ పై ఇన్ స్టామార్ట్ స్టిక్కర్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేశారు. బంగారం వెండి నాణేలను నేరుగా కస్టమర్లకు డెలివరీ చేయడానికి స్విగ్గీ ఇన్ స్టామార్ట్ ఇటీవల కళ్యాణ్ జ్యువెలర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని దాదాపు వంద నగరాల్లో 0.5 గ్రాముల నుంచి ఒక గ్రాము బంగారం, 5 గ్రాముల నుంచి 20 గ్రాముల బరువున్న వెండి నాణేలను డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే బంగారం డోర్ డెలివరీ తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బంగారం తరలించడానికి ఏర్పాటు చేసిన జెడ్ సెక్యూరిటీ ఇదేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బంగారం తరలిస్తున్నట్టు రోడ్డుపై ప్రతి ఒక్కరికి అలాగే దొంగలకి తెలిసిపోయిందని ఈ సెక్యూరిటీ ఏం సరిపోతుంది భయ్యా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

