ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో
జుట్టు పెరిగితే సాధారణంగా హెయిర్ కట్ చేసుకుంటాం. నేటి యువత చాలామంది ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలంటే అప్పుడు సెలూన్ కి వెళ్లి వారికి కావలసిన స్టైల్ లో హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు. సాధారణంగా శుక్ర, మంగళవారాలు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో హెయిర్ కట్లు చేయనెవ్వరు. హిందూ శాస్త్రం ప్రకారం శుశ్రు కర్మకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి? వాటివల్ల ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఉదయం 12 గంటల లోపు హెయిర్ కట్ చేయించుకుంటే శుభం కలుగుతుంది అని చెబుతారు. రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదట. అలాగే తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఒకే రోజు హెయిర్ కట్ చేసుకోకూడదని పెద్దలు చెబుతారు. చాలామంది హెయిర్ కట్ చేయించుకోవడానికి ఆదివారాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఆరోజు విద్యాసంస్థలకు, ఆఫీసులకు వెళ్లేవారికి చాలామందికి సెలవు రోజు. అయితే ఆదివారం హెయిర్ కట్ చేసుకోవడం అస్సలు మంచిది కాదట. దీనివల్ల ఒక నెల ఆయువు తగ్గిపోతుందట. సోమవారం హెయిర్ కట్ చేయించుకుంటే ఏడు మాసాల ఆయువు వృద్ధి చెందడమే కాకుండా సౌఖ్యం కలుగజేస్తుందని చెబుతారు. సాధారణంగా చాలామంది మంగళవారం హెయిర్ కట్ చేసుకోవద్దని చెబుతూ ఉంటారు. ఈ రోజు కటింగ్ చేయించుకుంటే ఎనిమిది మాసాల ఆయుష్షు తగ్గిపోతుందట. బుధవారము హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఐదు మాసాలు, గురువారం కటింగ్ చేయించుకుంటే పది నెలల ఆయువు వృద్ధి చెందుతుందని నమ్ముతారు. ధనవృద్ధి కోరుకునేవారు గురువారం రోజు క్షౌరము చేయించుకోకూడదని చెబుతారు. శుక్రవారం సాధారణంగా ఎవరూ హెయిర్ కట్ చేయించుకోరు. కానీ శుక్రవారం రోజు హెయిర్ కట్ చేయించుకుంటే పదకొండు మాసాలు ఆయువు వృద్ధి చెందుతుందట. శనివారం రోజు హెయిర్ కట్ చేయించుకుంటే ఏడు నెలలు ఆయుష్షు తగ్గిపోతుందట. అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట.
మరిన్ని వీడియోల కోసం :
వామ్మో ఈ కాకి ఎంత పని చేసింది వీడియో
ఆ జైలు చుట్టూ షార్క్ చేపలతో రక్షణ.. ఎందుకంటే వీడియో
బంగారాన్ని ఇలా కూడా డెలవరీ చేస్తారా? వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

