మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో
మన శరీరంలో పలు రకాల హార్మోన్లు పనిచేస్తూ మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఆక్సిటోసిన్. దీనిని లవ్ హార్మోన్, బాండింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మనుషుల మధ్య ప్రేమ, విశ్వాసం, అనుబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిటోసిన్ లెవెల్స్ పెరిగితే మానసిక ప్రశాంతత, సంతోషకరమైన అనుభూతి కూడా కలుగుతుంది. రోజు కొద్దిసేపు అయినా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు హార్మోన్ల స్థాయిలు సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా యోగా, వాక్, లైట్ జిమ్ వర్కౌట్లు వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది. డాన్స్ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ తో పాటు డోపామైన్, ఎండార్ఫిన్స్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మనలో ఉల్లాసాన్ని, ప్రేమను, శక్తిని పెంచుతాయి. ఇష్టమైన వాళ్ళతో సమయాన్ని గడిపితే మనసు ప్రశాంతంగా మారుతుంది. దీని ప్రభావంతో శరీరంలో ఆక్సిటోసిన్ విరబూస్తుంది.
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
