స్కూల్లో జుట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న లేడీ స్టాఫ్ వీడియో
వక్రమార్గం పట్టే పిల్లలను సక్రమార్గంలో పెట్టాల్సిన టీచర్లే గాడి తప్పుతున్నారు. మగ టీచర్లే కాదు ఆఖరికి లేడీ టీచర్లు కూడా మేమేమి తక్కువ కాదు అన్నట్లుగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ గవర్నమెంట్ స్కూల్లో లేడీ ప్రిన్సిపాల్, లేడీ లైబ్రేరియన్ దారుణంగా కొట్టుకున్నారు. జుట్టు పట్టుకొని డబ్ల్యుడబ్ల్యుఈ షోని మించిపోయేలా కుమ్ముకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్, కోర్గునేలో ఏకలవ్య అనే ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలకు ప్రవీణ దహియా ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అదే పాఠశాలలో మధురాణి లైబ్రేరియన్ గా విధులు నిర్వర్తిస్తుంది. పనికి సంబంధించిన విషయంలో ఇద్దరికీ గొడవ మొదలైంది. అది చినికి చినికి గాలివానలా మారింది. కొద్దిసేపటికే అది కొట్టుకునే వరకు వెళ్ళింది.
వైరల్ వీడియోలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
