కొడుకు చేతికి ఫోన్ ఇస్తే..తల్లికే చుక్కలు చూపెట్టాడుగా వీడియో
ఆడుకునే పిల్లలే కదా అని ఎప్పుడూ అడిగితే అప్పుడు ఫోన్లు ఇస్తున్నారా? అయితే ఈ వార్త తెలిస్తే ఇకపై చచ్చిన మీ పిల్లలకు ఫోన్ ఇవ్వరు. కొడుకే కదా అని ఆడుకునేందుకు ఫోన్ ఇచ్చిన తల్లికి చివరికి చుక్కలు చూపించాడో బుడ్డోడు. ఫోన్లో కొడుకు ఆర్డర్ చేసిన వస్తువులు బిల్ చూసుకుని చివరికి ఆమె కంగుతింది. ఇంతకి అసలు ఏం జరిగిందంటే అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లెక్సింగ్టన్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల లియామ్ అతని తల్లితో ఉంటున్నాడు. బుడ్డోడికి లాలిపాప్ అంటే చచ్చేంత ఇష్టం.
కొడుకంటే తల్లి హాలీ లా ఫేవర్స్కు ఎంతో ఇష్టం. దీంతో ఏమడిగినా కాదనకుండా కొనిచ్చేది. ఇటీవల స్మార్ట్ ఫోన్కు అలవాటు పడ్డ లియామ్ తరచు తల్లి ఫోన్ తీసుకుంటూ ఉండేవాడు. కొడుకే కదా అని తల్లి కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు ఫోన్ ఇస్తూ వచ్చింది. అయితే ఇటీవల ఆడుకుంటానంటూ ఫోన్ తీసుకొని బుడ్డోడు చేసిన పనికి తల్లి కంగుతింది. తల్లి స్మార్ట్ ఫోన్ తీసుకున్న లియామ్ ఆన్లైన్ యాప్ అమెజాన్ ద్వారా 30 కేసుల లాలిపాపులను ఆర్డర్ చేశాడు. ఒక్కో బాక్సులో 2300 లాలిపాపులు ఉంటాయి. అలాంటి 30 కేసులు 70 వేల లాలిపాపులను ఆర్డర్ పెట్టాడు. మొత్తం 4200 డాలర్లు అంటే మన కరెన్సీలో 3,55,795 రూపాయలకు బిల్ చేశాడు. కొడుక్కి ఫోన్ ఇచ్చి టీవీ షో చూస్తూ ఉన్నానని తల్లి చెప్పింది. కాసేపటికే డోర్ బెల్ మోగిందని కిటికీలో నుంచి బయటకు చూడగా ఒక పెద్ద ట్రక్ తన ఇంటి బయట ఉండటం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపింది. ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు వెళ్లి విచారించగా అసలు విషయం తెలిసిందని తర్వాత తన ఫోన్ చూసుకోగా ఒక్క బాక్సులో 2300 లాలిపాపులతో 30 కేసుల్లో 70 వేల లాలిపాపులను ఆర్డర్ పెట్టినట్లు ఆమె గుర్తించింది.
మరిన్ని వీడియోల కోసం :
కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో
పైనాపిల్ జ్యూస్ తాగడం వలన బోలెడు లాభాలు వీడియో
ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో
మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
