AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఘోర అగ్నిప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి..

నల్గొండ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజి వద్ద జాతీయ రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న కారు డివైడర్ కు ఢీకొట్టడంతో...

Telangana: ఘోర అగ్నిప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి..
Fire Accident In Car
Ganesh Mudavath
|

Updated on: Dec 16, 2022 | 7:05 AM

Share

నల్గొండ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజి వద్ద జాతీయ రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న కారు డివైడర్ కు ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ముగ్గురు పెద్దవారు కాగా ఇద్దరు చిన్నారు. ఐదుగురిలో ఇద్దరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలకు అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.

మరో ఘటనలో.. విద్యుత్తు తీగల లోడుతో వెళుతున్న లారీ దగ్ధమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద గురువారం మధ్యాహ్న ఈ ప్రమాదం జరిగింది. మంటలను గమనించిన డ్రైవర్‌ రోడ్డు పక్కన లారీ నిలిపి క్లీనర్‌తో సహా కిందకు దూకారు. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. కర్ణాటక రాష్ట్రం కలబురగి నుంచి చెన్నైకు విద్యుత్తు తీగల లోడుతో వెళుతున్న లారీ నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీతో పాటు విద్యుత్తు తీగల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..