Telangana: ప్రేమ జంటకు అండగా నిలిచిన పోలీసులు.. అంతలోనే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..
వంద అబద్ధాలు ఆడి అయిన ఓ పెళ్లి చేయాలన్నారు మన పెద్దలు. అయితే తమ పెళ్లి కోసం ఓ ప్రేమ జంట అబద్ధం చెప్పి పోలీసులనే బురిడీ కొట్టించింది. ఆ ప్రేమ జంట చేసిన నిర్వాకంతో పోలీసులే అవాక్కయ్యారు. ఆ ప్రేమ జంట చెప్పిన అబద్ధం ఏంటి..? పోలీసులను ఎలా బురిడీ కొట్టించారు. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేష్లన్ పరిధి అబ్బాయిది. మునగాల పోలీస్ స్టేషన్ పరిధి అమ్మాయిది.

వంద అబద్ధాలు ఆడి అయిన ఓ పెళ్లి చేయాలన్నారు మన పెద్దలు. అయితే తమ పెళ్లి కోసం ఓ ప్రేమ జంట అబద్ధం చెప్పి పోలీసులనే బురిడీ కొట్టించింది. ఆ ప్రేమ జంట చేసిన నిర్వాకంతో పోలీసులే అవాక్కయ్యారు. ఆ ప్రేమ జంట చెప్పిన అబద్ధం ఏంటి..? పోలీసులను ఎలా బురిడీ కొట్టించారు. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేష్లన్ పరిధి అబ్బాయిది. మునగాల పోలీస్ స్టేషన్ పరిధి అమ్మాయిది. కలిసి చదువుకున్న వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోవాలని భావించారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరనే భయంతో ఈనెల ఒకటో తేదీన పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట రక్షణ కోసం మేళ్లచెరువు పోలీసులను ఆశ్రయించింది.తాము మేజర్లమంటూ చదువు ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులను పోలీసులకు చూపించారు. దీంతో గుడ్డిగా నమ్మిన పోలీసులు ప్రేమ జంటకు రక్షణ కల్పించారు. మేజర్లే అని నిర్ధారించిన పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను ఇబ్బందులు పెట్టొద్దంటూ కుటుంబ సభ్యులను మందలించి లేఖ రాయించుకున్నారు. దీంతో పోలీసులు.. ప్రేమ పెళ్లి జంటను పెళ్ళికొడుకు తల్లిదండ్రులకు అప్పగించారు. 20రోజుల పాటు ప్రేమ జంట కాపురం సజావుగా సాగింది. మూడు రోజుల క్రితం అమ్మాయి మైనర్ అంటూ తల్లిదండ్రులు.. అబ్బాయిపై మునగాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ జంట అమ్మాయి వయసు మార్చి ఫోర్జరీ ఆధార్ కార్డు పత్రాలతో వివాహం చేసుకున్నారని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను చూపించారు. దీంతో మునగాల పోలీసులు అబ్బాయిపై ఫోక్సో, అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట రక్షణ కోసం ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేసి బురిడీ కొట్టించడంతో పోలీసులు షాక్ తిన్నారు. కనీసం వయస్సు నిర్ధారించుకోకుండా నిర్లక్ష్యంగా మైనర్ల పెళ్లిని అంగీకరించి రక్షణ కల్పించిన మేళ్లచెరువు పోలీసుల తీరును స్థానికులు తప్పుపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




