Hyderabad: ‘ఏయ్.. మా క్యాస్ట్ ఏంటో తెలుసా?’.. కారుకు ఎంపీ స్టిక్కర్.. పోలీసులనే దబాయించిన ఇద్దరు యువకులు..

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి మందుబాబులు హల్ చల్ చేశారు. పీకలదాకా మద్యం సేవించి.. నడిరోడ్డుపై నానాయాగి చేశారు. బీఎండబ్ల్యూ కారు,

Hyderabad: ‘ఏయ్.. మా క్యాస్ట్ ఏంటో తెలుసా?’.. కారుకు ఎంపీ స్టిక్కర్.. పోలీసులనే దబాయించిన ఇద్దరు యువకులు..
Drunk And Drive
Follow us

|

Updated on: May 12, 2022 | 8:01 PM

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి మందుబాబులు హల్ చల్ చేశారు. పీకలదాకా మద్యం సేవించి.. నడిరోడ్డుపై నానాయాగి చేశారు. బీఎండబ్ల్యూ కారు, దానికి ఎంపీ స్టిక్కర్ పెట్టుకుని హంగామా చేశారు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇతర వాహనదారులను, పాదాచారులను హడలెత్తించారు. ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. అయినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి కారును అడ్డగించారు. వారిని ఆపి.. కిందకు దించారు. అయితే, పోలీసులను సైతం లక్ష్య పెట్టలేదు ఆ మందు బాబులు. పైగా కారు నుంచి దిగి.. మేమెవరో తెలుసా? మా క్యాస్ట్ ఏంటో తెలుసా? అంటూ పోలీసులనే దబాయించారు. ఈ ఘటన హైదారాబాద్‌లోని కొండాపూర్ జంక్షన్‌లో చోటు చేసుకుంది.

నిహాల్ రావు, లోహిత్ రెడ్డి ఫుల్లుగా మద్యం సేవించారు. ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో ప్రయాణిస్తున్న వీరిని పోలీసులు అడ్డగించారు. వారి పరిస్థితి ఎలా ఉందంటే.. కదలకుండా ఒక్క క్షణం కూడా నిలబడలేనంత నిషా నషాళానికి ఎక్కింది. ఎక్కడున్నారో.. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీనంత మైకం కళ్లను, నోటిని కమ్మేసింది. పోలీసులు వెహికిల్‌ చెక్‌ చేస్తున్నంతవరకూ ఇలా ఏదో ఒకటి వాగుతూ కనిపించారు. మా ఫోటో తీసుకున్నారా? మీ పనైపోయిందంటే ఇక మేం వెళ్లిపోతాం అంటూ పోలీసులతోనే పరాచికాలు ఆడారు.

ఇంతకీ ఎవరీ నిహాల్ రావు, ఎవరీ లోహిత్ రెడ్డి? వీళ్లద్దరూ వేసుకొచ్చిన MP స్టిక్కర్ ఉన్న కారు ఎవరిది? మత్తు ఎంత తలకెక్కితే ఇలా నడిరోడ్డుమీద పోలీసులతో భయం లేకుండా వ్యవహరిస్తారు? ఇంత న్యూసెన్స్ చేస్తారు? ఏది ఏమైనా.. ఈ మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే, స్టేషన్‌లోనూ వారు ఇలాగే ప్రవర్తించడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ఇద్దరు యువకుల వివరాలను పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు జూబ్లీహిల్స్ బ్రాడ్ వే పబ్‌లో మద్యం సేవించినట్లు నిర్ధారించారు. బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న యువకులకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా.. కారు నడిపిన నిహాల్ కు 250, లోహిత్ కు 500 వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీరి కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా.. దానిపై ప్రయాణిస్తున్న విజయ్(30), సూర్య(28)కి గాయాలయ్యాయి. వారిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. విజయ్, సూర్య ఇద్దరూ టాటా ఇన్యూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నట్లు గుర్తించారు.

అయితే, ప్రమాదానికి కారణమైన ఇద్దరు మందు బాబులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌లోనూ వీరిద్దరూ విచిత్రంగా ప్రవర్తించడమే కాకుండా.. పోలీసులను తిడుతూ నానా హంగామా చేశారు. కాగా, వీరు ప్రయాణించిన బీఎండబ్ల్యూ కారు, ఆ కారుకు ఎంపీ స్టిక్కర్ కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.