Dalit Bandhu: దళితబంధు నిధులు ప్రైవేట్ ఉద్యోగుల ఖాతాల్లోకి..! రూ.10లక్షల చొప్పున రూ.15కోట్లు ట్రాన్స్‌ ఫర్‌

అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది ఏమరపాటు కారణంగా పెద్ద పొరపాటు జరిగిపోయింది. దళితులకు చేరాల్సిన కోటి 50లక్షల దళిత బంధు నిధులు ప్రైవేటు ఉద్యోగి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి.

Dalit Bandhu: దళితబంధు నిధులు ప్రైవేట్ ఉద్యోగుల ఖాతాల్లోకి..! రూ.10లక్షల చొప్పున రూ.15కోట్లు ట్రాన్స్‌ ఫర్‌
Dalit Bandhu
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2022 | 8:01 PM

దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు కోసమే పథకం అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ద్వారా దళితులు ఎంట్రప్రెన్యూర్లుగా మారుతాన్నది సర్కార్‌ లక్షం. దేశంలో ఉన్న ప్రస్తుత అన్ని స్కీమ్‌లలో కెల్లా అతిపెద్ద నగదు బదిలీ పథకం కూడా ఇదే. ఈ స్కీమ్‌ పైలట్ ప్రాజెక్టు హుజురాబాద్‌లో ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది దశల వారీగా అమలవవుతోంది. కానీ, అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది ఏమరపాటు కారణంగా పెద్ద పొరపాటు జరిగిపోయింది. దళితులకు చేరాల్సిన కోటి 50లక్షల దళిత బంధు నిధులు ప్రైవేటు ఉద్యోగి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. బ్యాంక్ క్లర్క్‌ తప్పిదంతోనే ఇలా జరిగిందని తెలిసింది.

ఎస్సీ కార్పొరేషన్ దళిత బంధు నిధులను రంగారెడ్డి జిల్లా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలంటూ లక్డికపూల్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ అమౌంట్ లబ్దిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన క్లర్క్.. పొరపాటున అదే బ్యాంక్‌లో ఖాతాదారులుగా ఉన్న లోటస్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లోకి వేశాడు. ఏప్రిల్ 26న 15 మంది ఖాతాల్లోకి రూ.10 లక్షల చొప్పున కోటి 50 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. దాదాపు 15 రోజుల తరువాత తెలుసుకున్న బ్యాంక్ అధికారులు.. 14 మంది వద్ద డబ్బులు రికవరీ చేశారు. కృష్ణ అనే వ్యక్తి మాత్రం మొత్తం డబ్బులు వాడుకోవడంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బ్యాంక్ మేనేజర్ క్రాంతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Meal scheme: ఆస్పత్రుల్లోని అటెండర్లకు కడుపు నిండా భోజనం..రూ.5లకే ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం

Chennai Airport: అచ్చం సూర్య సినిమా సీన్‌ రిపీట్‌ చేశారు..కానీ, కథ అడ్డం తిరిగి అలా బుక్కయ్యారు..