Tukkuguda: అధికార టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్... బీజేపీలో చేరారు. దిల్లీలోని తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో...

Tukkuguda: అధికార టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్
Bjp Trs
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 09, 2022 | 1:56 PM

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్… బీజేపీలో చేరారు. దిల్లీలోని తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. మధు మోహన్‌తో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మధు మోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీఆర్ఎస్ లోకి చేరి తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మదన్ మోహన్ పార్టీ మారడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మధు మోహన్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మం కోసం ఆయన అనేక సందర్భాల్లో పోరాడారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ ఛైర్మన్లు అన్యాయానికి గురవుతున్నారని తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ అన్నారు. అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ స్వభావం కలిగిన మధు మోహన్ తిరిగి సొంత గూటికి చేరారని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ ఎజెండాలో అభివృద్ధి అన్నదే లేదని ఆరోపించారు.

Read Also

UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్!

అమ్మ కాబోతున్న అంటూటాలీవుడ్ చందమామ.. బేబీ బంప్‌తో కాజల్‌ అగర్వాల్ ఫోటోస్..

UP polls: ఉత్తరప్రదేశ్‌ మొదటి విడత ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారిన కులమతాలు