AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై ఆదివాసీల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలంటు డెడ్‌లైన్..

తుడుందెబ్బ వర్సెస్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మద్య చిచ్చు రాజుకుంది. ఇన్నాళ్లు ఐక్యంగా పోరాటం చేసిన ఆదివాసీలు ఎంపి సోయం బాపురావు చేసిన కామెంట్స్ తో రెండుగా చీలాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇన్నాళ్లు జాతి కోసం జాతి ఐక్యత కోసం పోరాడిన ఆదివాసీ తొమ్మిది తెగలు ఆదిలాబాద్ ఎంపి సోయం చేసిన వ్యాఖ్యలతో తుడెందెబ్బ వర్సెస్ ఎంపి‌వర్గాలుగా చీలిపోయారు. ఈనెల 9 న జరిగిన‌ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సభలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురంభీం కాలనీలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ..

Telangana: బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై ఆదివాసీల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలంటు డెడ్‌లైన్..
Mp Soyam Bapu Rao(file Photo)
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 13, 2023 | 3:11 PM

Share

బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్‌లో కాకరేపుతున్నాయి. ఆదివాసీ దినోత్సవం వేళ ఆదివాసీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఆ సామాజికి వర్గం మధ్యలో చిచ్చు పెట్టాయి. సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళలను అవమానిస్తూ మాట్లాడాడని వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ తుడుందెబ్బ సోయం కు వార్నింగ్ ఇవ్వడం మరింత మంటలు రాజేస్తోంది. సోయం సైతం బహిరంగ లేఖ విడుదల‌ చేసినా.. లేఖలు కాదు బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటోంది తుడుందెబ్బ.

ఆదిలాబాద్ జిల్లాలో తుడుందెబ్బ వర్సెస్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మద్య చిచ్చు రాజుకుంది. ఇన్నాళ్లు ఐక్యంగా పోరాటం చేసిన ఆదివాసీలు ఎంపి సోయం బాపురావు చేసిన కామెంట్స్ తో రెండుగా చీలాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇన్నాళ్లు జాతి కోసం జాతి ఐక్యత కోసం పోరాడిన ఆదివాసీ తొమ్మిది తెగలు ఆదిలాబాద్ ఎంపి సోయం చేసిన వ్యాఖ్యలతో తుడెందెబ్బ వర్సెస్ ఎంపి‌వర్గాలుగా చీలిపోయారు. ఈనెల 9 న జరిగిన‌ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సభలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురంభీం కాలనీలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ కుటుంబాలను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం అగ్గి రాజేసింది. కొమురంభీం కాలనీలోని మహిళలు అక్రమ సంబదాలు పెట్టుకుంటు జాతికి చెడ్డ పేరు తెస్తున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడిన మాటలే ఇప్పుడు జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో మంటలు రేపాయి. దీంతో ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని డిసైడ్ అయిన తుడుందెబ్బ ఆదివాసీ మహిళలతో కలిసి ఆందోళ‌లనకు పిలుపు నిచ్చింది. కొమురంభీం చౌరస్తా లో ఎంపి‌సోయం బాపురావు దిష్టి బొమ్మ దహనం చేయడం.. ఆదివాసీ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేయడం, ఐదు రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే నాలుక కోస్తామంటూ తుడుందెబ్బ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేయడం మరింత కాక రేపాయి.

మరో వైపు ఎంపి‌సోయం వర్గానికి చెందిన కోలాం సంఘ అద్యక్షుడు సోనేరావు తుడుందెబ్బ తీరును నిరసిస్తూ వ్యాఖ్యనించడం.. ఆదివాసీ మహిళలు సోనే రావుపై దాడికి దిగడం.. ఆందోళనకు దారి తీశాయి. అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు‌చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తూ ఎంపీ‌ సోయం బహిరంగ లేఖ రాయడం.. ఆ లేఖలో రాజకీయ‌ కుట్రలో భాగంగానే తుడుందెబ్బ నాయకులు తనపై నిందలు మోపుతున్నారంటూ ప్రస్తావించడంతో తుడుందెబ్బ గట్టి కౌంటర్ ఇచ్చింది. తుడుందెబ్బ మాజీ అద్యక్షుడిగా కొనసాగిన‌ మీరు ఆదివాసీ సమాజం మీద చిల్లర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని తెలిపింది. ఆదివాసీ మహిళలంటే తనకు తల్లులతో సమానం అని ఎంపీ సోయం అంటున్నారు. ‘నా వాళ్లను‌ నేను గౌరవంగా బతికేలా పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నా.. జాతీ కోసం పోరాడుతుంటే నాపై నిందారోపణ లు శోచనీయం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరి శ్వాస వరకు ఆదివాసీ జాతి కోసం పోరాడుతూనే ఉంటానంటూ తెలిపారు ఎంపీ. అయితే అవన్నీ జాన్తానై.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటోంది తుడుందెబ్బ. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో.. ఎలాంటి పరిస్థితులకు కారణం అవుతుందో అన్న టెన్షన్ ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అటు ఆదివాసీ గూడాల్లో కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!