AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad:  హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు..  తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

Hyderabad: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Aug 13, 2023 | 3:52 PM

Share

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న OSD హరికృష్ణను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం.. ఇంఛార్జ్‌ OSDగా సుధాకర్‌ను నియమించింది. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్లో లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఓఎస్డీ, వార్డెన్లు, కోచ్‌ల ప్రవర్తనపై చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు ప్రశ్నించారు. ఓఎస్డీ హరికృష్ణ ప్రవర్తనపైనా ఆరా తీస్తున్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఘటనపై స్పందించారు పుల్లెల గోపిచంద్. క్రీడాకారులకు భద్రత కల్పించడం అత్యవసరమన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించొద్దన్నారు గోపిచంద్‌. ఆడపిల్లలు వేధింపులకు గురైతే పేరెంట్స్ క్రీడల వైపు పంపరన్నారు.

హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్లో లైంగిక వేధింపుల అంశం కలకలం రేపుతోంది. ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయింది. పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. స్పోర్ట్స్‌ స్కూల్లో అరాచకాలపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను కోరారు. కవిత ట్వీట్‌పై స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారిపై తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న OSD హరికృష్ణను సస్పెండ్ చేశామన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. వేధింపులపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. రెండు, మూడు రోజుల్లో విచారణ పూర్తైన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్. OSD హరికృష్ణకు సహకరించిన వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న OSD హరికృష్ణ మాత్రం.. దీన్ని తిప్పికొడుతున్నారు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న OSD హరికృష్ణను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం.. ఇంఛార్జ్‌ OSDగా సుధాకర్‌ను నియమించింది. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్లో లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఓఎస్డీ, వార్డెన్లు, కోచ్‌ల ప్రవర్తనపై చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు ప్రశ్నించారు. ఓఎస్డీ హరికృష్ణ ప్రవర్తనపైనా ఆరా తీస్తున్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఘటనపై స్పందించారు పుల్లెల గోపిచంద్. క్రీడాకారులకు భద్రత కల్పించడం అత్యవసరమన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించొద్దన్నారు గోపిచంద్‌. ఆడపిల్లలు వేధింపులకు గురైతే పేరెంట్స్ క్రీడల వైపు పంపరన్నారు.

Published on: Aug 13, 2023 03:34 PM