Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో గుబులు రేపుతోన్న కొత్త ఎండీ బాజిరెడ్డి కామెంట్లు.!

యస్.. తెలంగాణ ఆర్టీసీకి మూడే మూడు నెలల గడువు దేనికి సంకేతం? లాభాల్లోకి రాకపోతే ప్రైవేటీకరణ ఖాయమేనా? అదే నిజమైతే కొత్త ఎండీ

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో గుబులు రేపుతోన్న కొత్త ఎండీ బాజిరెడ్డి కామెంట్లు.!
TSRTC
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 23, 2021 | 11:28 AM

TSRTCMD Bajireddy Govardhan reddy: యస్.. తెలంగాణ ఆర్టీసీకి మూడే మూడు నెలల గడువు దేనికి సంకేతం? లాభాల్లోకి రాకపోతే ప్రైవేటీకరణ ఖాయమేనా? అదే నిజమైతే కొత్త ఎండీ నియామకం ఎందుకు జరిగినట్టు? అర్థం పరమార్ధం ఏదైనా.. కొత్త చైర్మన్‌ కామెంట్లు ఆర్టీసీ ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. అసలే అప్పుల కుప్పలు.. ఆపై కరోనా పంజా.. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్టీసీ గండాలు దాటి గట్టెక్కుతుందా అన్నది బిగ్‌ టాస్క్‌గా కనిపిస్తోంది.

ఫలితంగా, రైట్‌ రైట్‌ అంటూ రయ్‌మంటూ దూసుకెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సు చక్రానికి బ్రేక్‌లు పడబోతున్నాయా అన్న ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది. నిజానికి ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం శతివిధాలా ప్రయత్నిస్తుంది. కానీ పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. లాభాల మాట దేవుడెరుగు. అప్పులు తీర్చే మార్గం కూడా కనిపించడం లేదు. సమయానికి ఉద్యోగులకు జీతాలివ్వలేని సిట్యువేషన్‌. ఈ క్రమంలో ప్రభుత్వం టార్గెట్‌ విధించడంతో ఎన్నో అనుమానాలు, సందేహాలు తెరమీదకు వస్తున్నాయి.

కొత్త చైర్మన్‌ నియామకం ఇలా జరగ్గానే అలా టార్గెట్‌ ఫిక్స్‌ చేసింది ప్రభుత్వం. మూడు నెలల్లో లాభాల పట్టాలని.. లేదంటే ఆ తర్వాత ఏదైనా జరగొచ్చన్న సిగ్నల్స్‌ పంపించింది. 95శాతం డిపోల్లో వందకు వంద శాతం నష్టం వస్తుందన్నారు చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి. ఈ విషయంలో అధికారుల ప్రోత్సాహం ఆదర్శవంతంగా ఉండాలని సూచించారాయన. డీజిల్‌ రేట్‌ హైక్‌ ఆర్టీసీని మరింత నష్టాలపాలు చేసిందన్నారు గోవర్ధన్‌ రెడ్డి. అయితే ఉద్యోగులే ప్యాసింజర్ల పికప్‌.. ఏయే రూట్‌లో లాభాలు వస్తాయన్నది గుర్తించాలన్నారు.

సమ్మె తరువాత TS RTC మెల్లిమెల్లిగా కొలుకుంటూ వస్తోంది. అయితే కరోనా కారణంగా మళ్లీ నష్టాలబాట పట్టింది. ఏడాదిన్నర కాలంలో 2 వేల 780 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ అప్పు ఈ ఏడాది జూన్ నాటికి 6వేల 115 కోట్లు గా తేల్చారు. మరోవైపు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీ కొద్దిగా ఆలస్యమైనా ఉద్యోగులకు జీతాలిస్తుంది. మరికొన్ని రోజుల్లో సంస్థ బాకీపడిన మొండి బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ అప్పులు, ఆస్తుల వివరాలను సేకరించి.. త్వరలోనే శాశ్వతంగా ఆర్థికాభివృద్దిలో పయనించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్కార్‌ విధించిన టార్గెట్‌తో ఉద్యోగుల్లో తెలియని భయం మొదలైంది.

Read also:  Airports: వేల కోట్ల నష్టాలతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ తెరపైకి తెచ్చిన ఫార్ములా.. కేంద్రం దారెటు.?