AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం.. పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు గాలింపు!

మళ్లీ పులి కనిపిస్తూనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రజల్ని హడలెత్తిస్తోంది. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేస్తోంది.

కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం.. పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు గాలింపు!
Tiger Terror
Balaraju Goud
|

Updated on: Sep 23, 2021 | 11:30 AM

Share

Telangana Tiger terror: మళ్లీ పులి కనిపిస్తూనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రజల్ని హడలెత్తిస్తోంది. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేస్తోంది. నిజానికి పులి మేకను చంపితే పెద్దగా పట్టించుకోం. అదే పులి మనిషిని చంపితే గాబరా పడతాం. కానీ ఆ పులికి మనిషైనా, మేకైనా ఒకటే. ఈసారి వచ్చింది మామూలు పులి కాదు.. మనిషి రక్తం మరిగిన పులి.

కొమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. బెజ్జూరు మండలం గబ్బాయి అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. పులి దాడిలో ఇప్పటికే ఒక ఆవు మృతి చెందగా.. మరో రెండు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. పశువుల కాపర్లు పులిని చూసి ఇద్దరు కాపర్లు పరుగు పరుగున చెట్టెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులి సంచారానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. పులి పాద ముద్రల ఆధారంగా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు

ఇదిలావుంటే, మహారాష్ట్ర గడ్చిరోలి-చంద్రాపూర్‌ ఫారెస్ట్‌లో పులి గజగజలాడిస్తోంది. ఒకరిద్దర్ని కాదు.. ఇప్పటికి 15మందిని చంపేసింది. నెలరోజుల్లో ఏడుగుర్ని చంపి రక్తం తాగేసింది. ఆగస్ట్‌ లో నాలుగుసార్లు, ఈనెలలో ఇప్పటికే మూడుసార్లు.. ఇలా ఐదారు రోజుల గ్యాప్‌లోనే మనుషల్ని చంపుతూ వస్తోందా పులి. మొత్తం 18 గ్రామాల పరిధిలోని ప్రజలకు ఈ మృగం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బయటకి వస్తే మాటేసిన పులి ఎటువైపు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో తెలియక జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

ప్రస్తుతానికి గడ్చిరోలి ఫారెస్ట్‌ ఏరియాలోనే పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అక్కడి స్థానికుల్ని వణికిస్తోంది. కానీ, దాని జాడ కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండాపోతుంది. దీంతో తెలంగాణ బోర్డర్‌లోకి వచ్చేసిందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గడ్చిరోలి ఫారెస్ట్ ఏరియా నుంచి మన బార్డర్‌కి దాదాపు 213 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ లేదంటే ఇక్కడికి వచ్చేసినట్టే అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లావాసుల్ని పులి భయం వెంటాడుతుంది. మరోవైపు ఫారెస్ట్‌ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

Read Also…  Ganesh Immersion: ఆ ఊర్లో తాబేళ్లపై ఊరేగుతున్న బొజ్జ గణపయ్య.. చూడముచ్చటైన వీడియో మీకోసం..