Ganesh Immersion: ఆ ఊర్లో తాబేళ్లపై ఊరేగుతున్న బొజ్జ గణపయ్య.. చూడముచ్చటైన వీడియో మీకోసం..
Ganesh Immersion: ఊర్లన్నీ ఉసూరుమంటున్నాయి.. వాడకట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.. నిన్నమొన్నటి దాకా ఏ గల్లీలో చూసినా గణేషుడి మండపాలు, డీజే మోతలతో హడావుడి కనిపించేది.
Ganesh Immersion: ఊర్లన్నీ ఉసూరుమంటున్నాయి.. వాడకట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.. నిన్నమొన్నటి దాకా ఏ గల్లీలో చూసినా గణేషుడి మండపాలు, డీజే మోతలతో హడావుడి కనిపించేది. యువత ఆటపాటలతో సందడిగా ఉండేది. వినాయక చతుర్థి నవరాత్రుల ముగియడంతో.. ఊరూ వాడా అన్నీ చిన్నబోయినట్లు కనిపిస్తున్నాయి. అయితే, ఓ చోట మాత్రం బుల్లి గణపయ్య.. ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ చూడని విధంగా సరికొత్త వాహనమెక్కి బరాత్‌కు బయల్దేరాడు. మరేందుకు ఆలస్యం.. ఆ సరికొత్త వాహనం ఏంటి? ఆ బొజ్జ గణపయ్య ఎక్కడ అనే విశేషాలు తెలుసుకుందాం పదండి..
పైన ఫోటోలో కనిపిస్తున్న బుజ్జి గణపయ్య తాబేలు మీద కూర్చొని ఊరేగుతున్నాడు. ఈ బుల్లి గణపయ్య చూడముచ్చటగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట శివాలయంలో ఈ ముచ్చటైన దృశ్యం కనిపించింది. శివాలయంలో వినాయక తాబేలు మీద ఊరేగించారు కొందరు భక్తులు. గులాబీ, చామంతి పూలతోటి తాబేలును అందంగా ముస్తాబు చేశారు. పసుపు, కుంకుమలతో బొట్లు కూడా పెట్టారు. ఇలా అందంగా అలంకరించి తాబేలుపై గణనాధుడు దర్జాగా కూర్చొని ఊరేగుతున్నాడు. ఆలయ పూజారి చాణక్య శాస్త్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఈ ఊరేగింపును చూసేందుకు భక్తులు కూడా చాలామందే వచ్చారు. మరెందుకు ఆలస్యం.. ఈ వెరైటీ ఊరిగేంపును మీరూ చూసేయండి.
Video:
Also read:
Airports: వేల కోట్ల నష్టాలతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ తెరపైకి తెచ్చిన ఫార్ములా.. కేంద్రం దారెటు.?
Crime News: పురుగుల మందు తాగిన భార్య.. కాపాడబోయిన పిల్లలను బంధించిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే..
Raj Tarun’s Anubhavinchu Raja: రామ్ చరణ్ వదిలిన రాజ్ తరుణ్ టీజర్.. ఆకట్టుకుంటున్న అనుభవించు రాజా…