Raj Tarun’s Anubhavinchu Raja: రామ్ చరణ్ వదిలిన రాజ్ తరుణ్ టీజర్.. ఆకట్టుకుంటున్న అనుభవించు రాజా…
కుర్ర హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం అనుభవించు రాజా.. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్.. మొదటి సినిమా ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు
Anubhavinchu Raja: కుర్ర హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం అనుభవించు రాజా.. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్.. మొదటి సినిమా ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో.. ఆతర్వాత సినిమా చూపిస్తా మామ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది. ఇక సుకుమార్ రైటింగ్స్‌లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్‌కు ఆవకాశాలు క్యూ కట్టాయి. అయితే కుమారి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అనుకోలేక పోయాడు.. ఆ మధ్య మంచు విష్ణుతో కలిసి ఆడో రకం ఈడోరకం అనే సినిమా చేశాడు ఈ యంగ్ హీరో.. ఈ సినిమా పర్లేదనికించుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఒరేయ్ బుజ్జిగా సినిమాకూడా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు శ్రీనివాస్ గవి రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్.. ఈ సినిమాకు అనుభవించు రాజా అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. రాజ్ తరుణ్ లుక్ చూస్తుంటే పేకాట .. కోడిపందాలుతో జీవితాన్ని విలాసవంతంగా గడిపేసేవాడిలా కనిపిస్తున్నాడు.
Here’s the fun-filled teaser of #AnubhavinchuRaja Good luck to the entire team !#AnubhavinchuRajaTeaserhttps://t.co/2Jt8V3qinw@AnnapurnaStdios @SVCLLP @itsRajTarun @GavireddySreenu @adityamusic @GopiSundarOffl pic.twitter.com/x7t1AsZFua
— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :