Naga Chaitanya: రానా బాటలో అక్కినేని యంగ్ హీరో.. ఛాలెంజింగ్ రోల్‌కు సై అంటున్న చైతన్య..
నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి రోల్ చేయడానికైనా రెడీ అవుతున్నారు హీరోలు. సోలో హీరోలుగా చేస్తూనే మల్టీస్టారర్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
Naga Chaitanya: నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి రోల్ చేయడానికైనా రెడీ అవుతున్నారు హీరోలు. సోలో హీరోలుగా చేస్తూనే మల్టీస్టారర్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతే కాదు సరైన సినిమా పడితే విలన్‌గా మెప్పించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కుర్ర హీరో కార్తికేయ.. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా మెప్పించిన విషయం తెలిసిందే.. గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఏకంగా తమిళ్ స్టార్ హీరో అజిత్ వాలిమై మూవీలో విలన్‌గా నటించే అవకాశం దక్కించుకున్నాడు. అలాగే దగ్గుబాటి హీరో రానా కూడా విలన్‌గా నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడు. ఇప్పటికే బాహుబలి సినిమాతోపాటు ఓ బాలీవుడ్ సినిమాలో విలన్‌గా మెప్పించిన రానా. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఈ లిస్ట్‌లో అక్కినేని యంగ్ హీరో కూడా చేరిపోయాడు. బావ రానా బాటలోనే చైతన్య కూడా నడవనున్నాడు.. త్వరలో నాగచైతన్య విలన్‌గా మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.
నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అదేవిధంగా బాలీవుడ్‌లో చైతూ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న చై.. త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నాడు. లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నానని తెలిపాడు. ఈ సిరీస్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించనున్నాడట. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని వెల్లడించాడు చైతన్య.
మరిన్ని ఇక్కడ చదవండి :